Virat Kohli: విరాట్ కోహ్లీ మోడరన్ డే క్రికెట్ లో ఎదురులేని మొనగాడు. అలాంటి కోహ్లీని బల్ల కింద దూరి బాల్ తీసుకోమని అన్నారు. ఇది నిజంగా నిన్న బంగ్లాదేశ్ తో జరిగిన సూపర్-8 మ్యాచ్ లో జరిగింది. భారత్ విసిరిన 197 పరుగుల లక్ష్యచేధన కోసం బంగ్లాదేశ్ బ్యాటర్లు ఆడుతున్నారు. 17వ ఓవర్లో బంగ్లాదేశ్ బ్యాటర్ రిషద్ హుస్సేన్ ఓ భారీ సిక్సర్ కొట్టాడు. డీప్ మిడ్ వికెట్ మీదుగా సిక్స్ వెళ్లిన బాల్ బౌండరీ బయట ఉన్న పోడియం కిందకు వెళ్ళింది. Virat Kohli
Match with Bangladesh Virat Kohli squeezed under the table
మన ఇండియాలో అయితే బాల్ ఇవ్వడానికి చాలామంది ఉంటారు. కానీ అక్కడ బాల్ ఇవ్వడానికి ఎవరు ఉండరు. అది వెస్టిండీస్. మన బాల్ మనమే వెళ్లి తీసుకోవాలి. దీంతో కోహ్లీ ఆ బాల్ ఎక్కడ ఉందో ముందుగా కిందకు వంగి మరి చూశాడు. అయినప్పటికీ ఆ బాల్ కనిపించకపోవడంతో పోడియం కింద ఉన్న గ్రిల్స్ లోకి దూరేసి మరీ వెతికాడు. చివరికి బాల్ ను కనిపెట్టి ఆ బాల్ ను పట్టుకుని జాగ్రత్తగా బయటకు తీసుకొని వచ్చాడు. Virat Kohli
Also Read: Mohammed Shami: టీమిండియాకు గుడ్ న్యూస్.. ఆ డేంజర్ బౌలర్ వచ్చేస్తున్నాడు !
ఇప్పుడు ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది. కింగ్ లాంటి కొహ్లీని బల్ల కిందకు దూరి బాల్ తీసుకోమని అంటారా అని విరాట్ ఫ్యాన్స్ తెగ ఫైర్ అవుతున్నారు. బాల్ అంత లోపలికి వెళ్ళినా కూడా అక్కడ సహాయం చేయడానికి ఎవ్వరూ రాకపోవడం ఏంటని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. Virat Kohli
ఇక మరికొంతమంది మా విరాట్ కోహ్లీ ఫిట్నెస్ చూడండి….అంత చిన్న గ్రిల్ లోకి చాలా ఈజీగా దూరి బాల్ వెతికి మరీ తీసుకున్నాడు. అది మా అన్న కింగ్ విరాట్ కోహ్లీ ఫిట్నెస్ అంటే….అని మరి కొంతమంది కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారింది. Virat Kohli