Matka: 1960, 1970 దశకాల్లో భారత ఆర్థిక వ్యవస్థను కదిలించిన ఆట మట్కా. ఆ రోజుల్లో టెలిఫోన్స్, టెలిగ్రామ్స్ కూడా లేని సమయంలో భారతదేశమంతా ఒకే నంబర్ కోసం ఎదురు చూసేది. ఆ నంబర్ అందించేవాడు వాసు. ఇప్పుడు, అతని జీవిత కథను ఆవిష్కరించడానికి ‘మట్కా’ సినిమా థియేటర్లలోకి రాబోతోంది.
Matka film based on 60s 70s financial crisis
ఈ కథలో వాసు పాత్రలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కనిపించనున్నారు. వాసు పాత్రలోని వైవిధ్యం, అతని జీవితం ఎలా మట్‌కా ఆటతో ముడిపడిందో, అది భారత ఆర్థిక వ్యవస్థపై ఎలా ప్రభావం చూపిందో ఈ సినిమాలో చూపించనున్నారు. వాసు జీవితంలోని రిస్క్ మార్గాలు, ఉత్కంఠభరిత ఘటనలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకునేలా రూపొందించారు. ఈ కథాంశం ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతిని కలిగించనుంది.
Also Read: Lucky Baskhar: లక్కీ భాస్కర్ ను మెచ్చిన మెగా స్టార్.. పిలిచి మరీ!!
ఈ చిత్రానికి దర్శకుడు కరుణ కుమార్ అద్భుతమైన విజన్‌తో దర్శకత్వం వహించారు. వరుణ్ తేజ్‌కు జోడీగా మీనాక్షి చౌదరి నటించగా, నోరా ఫతేహి ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. జి.వి. ప్రకాష్ సంగీతం అందించడంతో పాటుగా, కిషోర్ కుమార్ సినిమాటోగ్రఫీ అందించారు. ఈ చిత్రాన్ని వైర ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్.ఆర్.టి మూవీస్ బ్యానర్లపై నిర్మించారు.
‘మట్కా’ సినిమా నవంబర్ 14న థియేటర్లలో విడుదలకానుంది. అప్పటి సమాజంలో జరిగిన సంఘటనలు, వాసు పాత్ర ద్వారా మనకు తెలియజేయనున్నారు. ఆ రోజుల్లో మట్‌కా ఆట ఎలా ప్రాచుర్యం పొందిందో, ఈ ఆట ద్వారా ప్రజలు ఏ రకంగా తమ జీవనోపాధిని పొందుతున్నారో ఈ చిత్రం ద్వారా ప్రేక్షకులకు పరిచయం చేస్తారు.