Meena: సీనియర్ హీరోయిన్ మీనా రెండో పెళ్లి వార్తలు మీడియాలో ఎంతగా చక్కర్లు కొడుతున్నాయో చెప్పనక్కర్లేదు. ఈమె భర్త చనిపోయిన రెండు మూడు నెలలకే మీనా రెండో పెళ్లి చేసుకోబోతున్నట్టు రూమర్స్ క్రియేట్ చేశారు. మరీ ముఖ్యంగా ఈ పెళ్లి వార్తలపై మీనా క్లారిటీ ఇచ్చినా..ఆమె కూతురు క్లారిటీ ఇచ్చినా కూడా ఆగడం లేదు. మీనా కూతురు తల్లి రెండో పెళ్లి వార్తలపై ఎమోషనల్ కామెంట్స్ చేసింది.
Meena who is going to marry a divorced hero for the second time
ఆమె మాటలకు చాలామంది కన్నీళ్లు పెట్టుకున్నారు. అయినా కూడా ఈ వార్తలు ఆగలేదు. దీంతో రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మీనా మాట్లాడుతూ.. థాంక్యూ సో మచ్ టూ మీడియా.. సోషల్ మీడియాలో ఏదో ఒకటి హైలెట్ గా ఉండాలి కాబట్టి ఈ వార్తను తరచూ రాస్తున్నారు.అయితే ఈ వార్తను ఎన్ని సార్లు ఖండించినా మళ్ళీ అదే ప్రత్యక్షమవుతుంది.(Meena)
Also Read: Sruthi Haasan: శృతి హాసన్ కెరీర్ టర్న్.. ఆ హీరో తో మళ్ళీ ఎఫై** నడిపిస్తోందా..?
ఇక విడాకులు తీసుకున్న ధనుష్ తో నన్ను ట్యాగ్ చేస్తూ ఎన్నో వార్తలు సృష్టిస్తున్నారు. ఇక ఇండస్ట్రీలో ఎవరు సింగిల్ గా ఉంటే వారితో ట్యాగ్ చేసి రాయడమేనా.. సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది సింగిల్ గా ఉంటున్నారు.. అలా అయితే వారందరితో కూడా కలిపి రాయడమేనా.. ధనుష్ నేను ఇద్దరు రెండో పెళ్లి చేసుకోబోతున్నాం అన్న వార్తల్లో మాత్రం నేను చాలా బాధపడ్డాను.
మరీ ముఖ్యంగా ఇండస్ట్రీలో నేను చిన్నప్పటినుండి ఎంతోమందితో స్నేహంతో మెదులుతున్నాను. ఇలాంటి వార్తలు రాసేటప్పుడు ఒక్కసారైనా ఆలోచించి అడిగి రాయాలి.కానీ ఇలా తప్పుడు వార్తలు రాస్తే కుటుంబాలు ఎంత బాధ పడతాయో ఒక్కసారి ఆలోచించాలి అంటూ మీనా ధనుష్ తో పెళ్లి వార్తలపై మీడియాని ఏకీపారేసింది.(Meena)