Meenakshi Chaudary: యంగ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి అంటే ప్రస్తుతం ఇండస్ట్రీలో తెలియని వారు ఉండరు.ఈమె తన అందచందాలతో నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకొని సౌత్ ఇండస్ట్రీలో మంచి స్థానంలో ఉంది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరో కొడుకుతో పెళ్లికి రెడీ అయింది అంటూ కొన్ని వార్తలు కోలీవుడ్ మీడియాలో వినిపిస్తున్నాయి. మరి ఇంతకీ మీనాక్షి చౌదరి పెళ్లి చేసుకోబోతున్న ఆ హీరో కొడుకు ఎవరు? నిజంగానే ఈమె పెళ్లి జరగబోతుందా అనేది ఇప్పుడు చూద్దాం..
Meenakshi Chaudary marriage fix with that hero son
గుంటూరు కారం సినిమాలో మహేష్ బాబు మరదలి పాత్రలో నటించిన మీనాక్షి చౌదరి ఇండస్ట్రీలో ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది.కేవలం గుంటూరు కారం మూవీ మాత్రమే కాదు ఈ సినిమా కంటే ముందే మీనాక్షి ఫేమస్ అయిపోయింది. హిట్-2, ఖిలాడి సినిమాలతో హీరోయిన్ గా ఇండస్ట్రీలో ఫేమస్ అయ్యింది. అలాగే ఈ ముద్దుగుమ్మ ఇచ్చట వాహనాలు నిలపరాదు అనే సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. (Meenakshi Chaudary)
Also Read: Namitha: అర్థరాత్రి ఊరి చివర బంగ్లాలో రహస్యంగా ఆ పని చేసిన నమిత.?
అలా టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగిన ఈ ముద్దుగుమ్మ రీసెంట్ గా ది గోట్ మూవీ తో అభిమానుల ముందుకు వచ్చింది. ఇవే కాకుండా ఈ హీరోయిన్ ప్రస్తుతం విశ్వక్ సేన్ హీరోగా చేస్తున్న మెకానిక్ రాకీ, వరుణ్ తేజ్ మట్కా మూవీ లో కూడా హీరోయిన్ గా చేస్తుంది. ఇక దుల్కర్ సల్మాన్ తో మీనాక్షి చౌదరి నటించిన లక్కీ భాస్కర్ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.అలా చేతినిండా ఆఫర్లతో ఇండస్ట్రీలో దూసుకుపోతున్న మీనాక్షి చౌదరికి ఓ కోలీవుడ్ హీర కొడుకుతో పెళ్లి ఫిక్స్ అయినట్టు తమిళ మీడియాలో ప్రచారం జరుగుతుంది.
అయితే ఈ వార్తలు విన్న మీనాక్షి అభిమానులు ఇండస్ట్రీకి వచ్చిన ఇంత తక్కువ సమయంలోనే ఈ హీరోయిన్ పెళ్లికి రెడీ అయిందా ఇవి రూమర్సే అంటూ కొట్టి పారేస్తున్నారు. మరికొంత మందేమో మీనాక్షి చౌదరి క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇండస్ట్రీలో కాస్త ఫేమస్ అయిపోతే చాలు వారి మీద ఇలా రూమర్లు అల్లేయడం కామన్ కాబట్టి మీనాక్షి చౌదరి పెళ్లి వార్తలను ఎవరు అంతగా పట్టించుకోవడం లేదు.(Meenakshi Chaudary)