Meenakshi Chaudhary About Her New Movies

Meenakshi Chaudhary: సినిమాలు చేయాలంటేనే భయంగా ఉందంటున్న బిజీ బ్యూటీ!!: టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో హీరోయిన్ గా నిలదొక్కుకోవడం అంత ఈజీ కాదు. కాంపిటీషన్ తక్కువగానే ఉన్నా కూడా తెలుగు ప్రేక్షకులను మెప్పించడం అంటే కత్తి మీద సాము లాంటిదే. తమ అందం, అభినయం ద్వారా ప్రేక్షకులను కవ్వించి వరుస సినిమా అవకాశాలు అందుకోవాలి. ఆ విధంగా ప్రస్తుతం తనకంటూ ప్రత్యేక గుర్తింపును ఏర్పరుచుకుని హీరోయిన్ మీనాక్షి చౌదరి తెలుగు సినిమా ఇండస్ట్రీలో వరుస చిత్రాలను అందుకుంటూ స్టార్ డంను చేతికించుకుంటుంది. ఇచ్చట వాహనాలు నిలపరాదు అనే సినిమాతో తొలిసారిగా ప్రేక్షకులను పలకరించింది.

Meenakshi Chaudhary About Her New Movies

ఆ తరువాత వరుస ఆఫర్లు అందుకుంది. కానీ ఆమెకు స్టార్ హీరోయిన్ అయ్యే సినిమా పడలేదని చెప్పాలి. ఫైనల్ గా మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమాలో మహేష్ బాబు మరదలు పాత్రలో కనిపించి ఆకట్టుకుంది. ఆ విధంగా అందరిని మెప్పించిన ఈ ముద్దుగుమ్మకి ఇప్పుడు తెలుగులో మంచి అవకాశాలను అందుకుంటుంది. ఇటు తమిళ చిత్ర పరిశ్రమలో కూడా వరుస సినిమా అవకాశాలు అందుకుంటుంది. దుల్కర్ సల్మాన్, దళపతి విజయ్ వంటి హీరోల సరసన నటిస్తూ అక్కడ కూడా తనకు తిరుగులేదు అని చాటిచెబుతుంది.

Also Read: Mega Hero: మెగా హీరో కి ఏదీ కలిసి రావడం లేదు.. ఇంత డల్ అయిపోయాడేంటి?

తెలుగులో విశ్వక్ సేన్, వరుణ్ తేజ్, వెంకటేష్ వంటి హీరోల సరసన సినిమాలలో నటిస్తుంది. అయితే ఈ సినిమాలు విడుదలయి మంచి సక్సెస్ను సాధిస్తే మాత్రం తప్పకుండా ఆమె నెంబర్ వన్ పొజిషన్కు వెళ్లే అవకాశం ఎక్కువగా ఉంది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. తనకు చాలా భయంగా ఉందని తెలిపింది. వరుస పెద్ద చిత్రాల్లో నటిస్తూ ఉండడం ఆనందంగానే ఉంది కానీ ఆ సినిమాలు తనకు ఏ విధమైన ఫలితాన్ని తెచ్చిపెడతాయో అన్న భయం ఉందని చెబుతుంది. దీంతో ఆమె చేసిన ఈ కామెంట్స్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి. మీకు తెలియదు అంటూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు విడుదల కావడానికి సిద్ధమవుతున్నాయి మరి ఆమె ఎలాంటి విజయాలను అందుకుంటుందో చూడాలి.