Missed movie in Deepika Padukone Pawan Kalyan combo

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనే కాంబోలో ఓ సినిమా మిస్ అయిందట.అది కూడా డేట్స్ ఇచ్చాక దీపిక ఈ సినిమా నుండి తప్పుకుందట.మరి ఈ ఇద్దరి కాంబోలో మిస్సయిన సినిమా ఏంటి.. ఎందుకు మిస్ అయింది అనేది ఇప్పుడు చూద్దాం.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దీపిక పదుకొనే కాంబినేషన్లో మిస్ అయిన సినిమా ఏదో కాదు తీన్ మార్..

Missed movie in Deepika Padukone Pawan Kalyan combo

జయంత్ సి.పరాంజీ దర్శకత్వంలో బండ్ల గణేష్ ని నిర్మాతగా చేసిన ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన త్రిష, కృతి కర్బందాలు నటించారు.అయితే త్రిష కంటే ముందే చిత్ర యూనిట్ దీపికా పదుకొనేని తీసుకోవాలి అని నిర్ణయించుకున్నారట. ఇక అనుకున్నట్టే దీపికా పదుకొనే దగ్గరికి వెళ్లి స్టోరీ మొత్తం చెప్పడంతో ఆమె కూడా స్టోరీ నచ్చి డేట్స్ ఇచ్చిందట.(Pawan Kalyan)

Also Read: Sukumar: జాన్వీ విషయంలో సుకుమార్ కు వార్నింగ్ ఇచ్చిన బోణీ కపూర్!!

అయితే దీపికా డేట్స్ ఇచ్చాక బండ గణేష్ సరైన సమయానికి సినిమా తెరకెక్కించకపోవడంతో ఆ తర్వాత దీపిక పదుకొనే వేరే సినిమాకి డేట్స్ ఫిక్స్ చేసి పెట్టుకోవడంతో డేట్స్ సర్దుబాటు కాగా ఈ సినిమా నుండి తప్పుకుందట. ఆ తర్వాత ఈ మూవీలో దీపిక ప్లేస్ లో త్రిష ని తీసుకున్నారు. ఒకవేళ అనుకున్న సమయానికి చేసుంటే గనుక పవన్ దీపికా కాంబినేషన్లో తీన్మార్ సినిమా వచ్చుండేది.

Missed movie in Deepika Padukone Pawan Kalyan combo

అయితే సైఫ్ అలీ ఖాన్ ఆజ్ కల్ మూవీకి రీమేక్గా తెరకెక్కిన తీన్మార్ మూవీ బాలీవుడ్ లో హిట్ అయినప్పటికీ టాలీవుడ్ లో మాత్రం ఫ్లాప్ అయింది. అయితే ఈ సినిమా ఇప్పుడు రీ రిలీజ్ చేస్తే మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది అని సినీ జర్నలిస్టులు అంటూ ఉంటారు. అంతేకాదు బండ్ల గణేష్ కూడా కొన్ని ఇంటర్వ్యూలలో తీన్మార్ సినిమాని రీ ఎడిటింగ్ చేసి ప్రపంచవ్యాప్తంగా రీ రిలీజ్ చేస్తాను అంటూ కూడా చెప్పారు. మరి చూడాలి ఈ సినిమా రీ రీలీజ్ కి నోచుకుంటుందా లేదా అనేది.(Pawan Kalyan)