Monica Bedi Connection with Gangster Abu Salem

Monica Bedi: తెలుగు సినిమా ఇండస్ట్రీకి కొత్త కొత్త హీరోయిన్లు ఎప్పటికప్పుడు పరిచయం అవుతూనే ఉంటారు. గతంలో డైరెక్టర్లు ప్రత్యేకంగా కొత్త ముఖాలను తెరపైకి తీసుకురావడంలో ఉత్సాహం చూపించేవారు. ముఖ్యంగా రాఘవేంద్రరావు గారు ఎంతో మంది హీరోయిన్లను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఆ కోవలోకి చెందిన మోనికా బేడి, “తాజ్ మహల్” అనే సినిమాతో తెలుగుతెరకు పరిచయమైంది. తక్కువ సమయంలోనే మోనికా తన అందం, అభినయంతో మంచి పాపులారిటీ సంపాదించుకుంది.

Monica Bedi Connection with Gangster Abu Salem

పంజాబ్ కు చెందిన మోనికా, ఆమె తల్లిదండ్రులు ఉద్యోగరీత్యా ఢిల్లీలో స్థిరపడ్డారు, ఆమె అక్కడే విద్యాభ్యాసం పూర్తి చేసింది. తెలుగులో “తాజ్ మహల్,” “సోగ్గాడి పెళ్లాం,” “చూడాలని ఉంది,” “శివయ్య” వంటి సినిమాల్లో నటించి ప్రేక్షకాదరణ పొందింది. ఈ క్రమంలోనే ఆమెకు మంచి అవకాశాలు వచ్చాయి. అయితే, కెరీర్ అగ్రస్థాయిలో ఉన్నప్పుడే వివాదాల్లో చిక్కుకోవడం ఆమె కెరీర్ ను తీవ్ర దెబ్బతీశింది.

Also Read: Custard Apple: సీతాఫలం, వాటి ఆకులతో కలిగే ప్రయోజనాలు తెలిస్తే..షాక్‌ అవ్వాల్సిందే ?

2002లో నకిలీ పత్రాల కేసులో గ్యాంగ్ స్టర్ అబూ సలెం తో సంబంధం పెట్టుకోవడంతో ఆమె అరెస్టు అయ్యింది. జైలు శిక్ష అనుభవించిన మోనికా, 2006లో నకిలీ పాస్ పోర్ట్ కేసులో కూడా దోషిగా తేలింది. ఈ వివాదాలు, మాఫియా డాన్ లతో సంబంధాలు, నకిలీ పత్రాల వల్ల మోనికా తన కెరీర్ ను తానే నాశనం చేసుకుంది. తర్వాత కొన్ని టీవీ షోల ద్వారా తెరపైకి వచ్చేందుకు ప్రయత్నించినా, పెద్దగా గుర్తింపు పొందలేకపోయింది.

ప్రస్తుతం మోనికా బేడి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండి, తన ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులతో టచ్ లో ఉంటోంది. ఒకప్పుడు సినీ రంగంలో ఆమె అందం గురించి చర్చలు జరిగినప్పటికీ, ఇప్పుడు ప్రధానంగా ఆమె వ్యక్తిగత జీవితమే ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది.