Mrunal Thakur: సీతారామం,హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్ వంటి సినిమాలతో టాలీవుడ్ టాప్ హీరోయిన్ల లిస్టులో చేరిపోయింది మృణాల్ ఠాకూర్. ప్రస్తుతం ఆమె మాటలతో బీటౌన్ లో వైరల్ గా మారింది. ఆమె మాట్లాడిన మాటలు కొంతమంది ఆ క్రికెటర్ అభిమానులను హర్ట్ చేస్తున్నాయి.మరి ఇంతకీ మృణాల్ ప్రేమలో ఉన్న ఆ క్రికెటర్ ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం.. సెలబ్రిటీలకు క్రికెటర్స్ కి విడదీయలేని అనుబంధం ఉంటుంది. చాలామంది హీరోయిన్లు క్రికెటర్స్ తో ప్రేమలో పడ్డవారు ఉన్నారు.
Mrunal Thakur who is in love with a married cricketer
కొంతమంది పెళ్లిళ్లు కూడా చేసుకున్నారు.అలాంటి వారిలో విరాట్ కోహ్లీ అనుష్క శర్మలు కూడా ఉన్నారు. అయితే అలాంటి ఈ పెళ్లయిన విరాట్ కోహ్లీ అంటే తనకు పిచ్చి ఇష్టం అంటోంది హీరోయిన్ మృణాల్ ఠాకూర్. అయితే ఈ విషయం ప్రస్తుతం బీటౌన్ లో వైరల్ అవ్వడంతో మృణాల్ ఠాకూర్ కి విరాట్ కోహ్లీ ఇష్టమైతే మరి అనుష్క పరిస్థితి ఏమవుతుంది అంటూ నెటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు.(Mrunal Thakur)
Also Read: Nayanthara: నయనతార,విగ్నేష్ ల మధ్య గొడవ.. ఆ హీరో తో రొమాన్స్ చేస్తూ..?
అయితే మృణాల్ ఠాకూర్,విరాట్ కోహ్లీ ఇష్టం అని చెప్పింది ఇప్పుడు కాదు. గతంలో అప్పటి ఓల్డ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.ఇక గతంలోని ఓ ఇంటర్వ్యూలో మృణాల్ ఠాకూర్ మాట్లాడుతూ.. నాకు సచిన్, విరాట్ కోహ్లీలు చాలా ఇష్టం.ముఖ్యంగా విరాట్ కోహ్లీతో ప్రేమలో ఉన్నాను..ఆయన అంటే పిచ్చి ఇష్టం..నా బ్రదర్ వల్ల క్రికెట్ చూసే అలవాటు చేసుకున్నాను.
ఐదేళ్ల వయసు లో స్టేడియంలో ఇండియన్ జెర్సీ వేసుకొని ఎంతగానో ఎంజాయ్ చేశాను. ఇప్పుడు అదే జెర్సీ సినిమాలో చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది అంటూ అప్పట్లో మాట్లాడిన మృణాల్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ కోహ్లీ నీతో ప్రేమలో ఉంటే మరి అనుష్క గతి ఏం కాను అంటూ నెగిటివ్ కామెంట్లు పెడుతున్నారు.అయితే ఈ పోస్ట్ పై ఫైర్ అయింది మృణాల్ ఇలాంటివి స్ప్రెడ్ చేయడం ఇకనైనా ఆపండి అంటూ గట్టి కౌంటర్ ఇచ్చింది.(Mrunal Thakur)