Ms Dhoni: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ కోసం ఇప్పటినుంచి 10 ఫ్రాంచైజీలు రెడీ అవుతున్నాయి. ఇప్పటికే రీటెన్షన్ రూల్స్ ను భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈసారి ఆరుగురు ప్లేయర్లను.. రీటెన్షన్ తీసుకోవచ్చు. ఈసారి అన్ క్యాప్డ్… ప్లేయర్ రూల్ కూడా తీసుకువచ్చారు.

MS DHONI May Miss IPL 2025

దీంతో ఈ అన్ క్యాప్డ్ రూల్ కింద మహేంద్ర సింగ్ ధోని… చెన్నై తరపున ఆడబోతున్నారని మొన్నటి వరకు వార్తలు వచ్చాయి. అయితే ఇంతలోనే మహేంద్ర సింగ్ ధోని అందరికీ ఊహించని షాక్ ఇచ్చారు. ఐపీఎల్ 2025 సీజన్లో… మహేంద్ర సింగ్ ధోని ఆడే అవకాశాలు లేనట్టు తెలుస్తోంది. చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం పైన ఆయన కాస్త అలిగారట.

Also Read: Rishabh Pant: రిషబ్ పంత్ కు మరో ఎదురుదెబ్బ ?

చెన్నై సూపర్ కింగ్స్ సీఈవో కాశీ విశ్వనాధ్ ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేయడం లేదట మహేంద్ర సింగ్ ధోని. కలవాలని ప్రయత్నించిన అందుబాటులో ఉండడం లేదట మహేంద్ర సింగ్ ధోని. అయితే దీనిపై స్వయంగా కాశీ విశ్వనాథ్ మాట్లాడుతూ.. మేము మహేంద్ర సింగ్ ధోనితో మాట్లాడేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం… కానీ ధోని అందుబాటులోకి రావడం లేదని తెలిపారు. అయితే కాశీ విశ్వనాథ్ చేసిన వ్యాఖ్యలతో.. వచ్చే ఐపిఎల్ లో మహేంద్ర సింగ్ ధోని ఆడకపోవచ్చు అని… అందరూ అనుకుంటున్నారు.