Naga Babu shocking comments on Bunny and Tarak

Naga Babu: ఈ మధ్యకాలంలో మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ మధ్య కోల్డ్ వార్ పై ఎన్నో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే బన్నీకి నాగబాబుకి అస్సలు పడడం లేదని తెలుస్తోంది. ఇక ఈ ఇష్యూలోకి మెగా ఫ్యామిలీ మొత్తాన్ని నాగబాబు తీసుకువస్తున్నారని సమాచారం.కానీ రీసెంట్ గా అల్లు అర్జున్ గురించి పవన్ కళ్యాణ్ ఆసక్తికర కామెంట్లు చేశారు.నాకు ఏ హీరోతో పోటీ ఉండదు అని మాట్లాడారు. ఇక పవన్ నోట బన్నీ మాట రావడంతో వీళ్లిద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవు అని అందరికీ అర్థం అయిపోయింది.

Naga Babu shocking comments on Bunny and Tarak

అయితే నాగబాబు బన్నీ తారక్ లు ఎందుకు పనికిరారు అన్నట్లు ఆయన మాట్లాడిన వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతుంది.అయితే ఆ వీడియో ఇప్పటిది కాక పోయినప్పటికీ ప్రస్తుతం వైరల్ అవ్వడంతో చాలామంది నెటిజన్స్ షాక్ అవుతున్నారు.మరి ఇంతకీ నాగబాబు మాట్లాడిన వీడియోలో ఏముందయ్యా అంటే.. చాలామంది నేను లైఫ్ లో ఎందుకు పనికిరాని ఒక చవటని అని అనుకుంటున్నారు.కానీ అలాంటి వారందరూ రవితేజ జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. (Naga Babu)

Also Read: Nidhhi Agarwal: ఒకేసారి ఇద్దరు హీరోలతో ఆపనిచేసిన నిధి అగర్వాల్!!

ఆయన ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో అసిస్టెంట్ డైరెక్టర్ గా..లైట్ బాయ్ గా.. తన కెరీయర్ ని మొదలుపెట్టి ఎంతోమంది హీరోల సినిమాల్లో అసలు గుర్తింపు కూడా లేని చిన్న చిన్న పాత్రలు పోషించారు.కానీ అలాంటిది ఆయన ఇప్పుడు పెద్ద హీరో పెద్ద పెద్ద డైలాగులు చెబుతూ డాన్స్ చేస్తూ తన నటనతో ఎంతో మందిని ఆకట్టుకొని మాస్ మహారాజగా పేరు తెచ్చుకున్నారు.ఇక ఇండస్ట్రీలో ఎనర్జిటిక్ హీరోలు డాన్స్ చేసే హీరోలు అంటే అందరికీ బన్నీ, తారక్, రామ్ లే గుర్తుకొస్తారు.

Naga Babu shocking comments on Bunny and Tarak

కానీ ఆ హీరోలతో కూడా పోటీపడేంత సత్తా రవితేజలో ఉంది. ఎనర్జిటిక్ గా డాన్సులు చేయాలన్నా.. డైలాగులు చెప్పాలన్నా.. ఫైట్స్ చేయాలన్నా.. కూడా రవితేజ కరెక్ట్ గా సెట్ అవుతారు. ఆయన తన నటనతో ఎంతో మందిని ఆకట్టుకొని ఇప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు అంటూ మాస్ మహారాజ రవితేజ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు నాగబాబు. అయితే ఈయన మాటలు కాంట్రవర్సీగా మారుస్తూ అంటే రవితేజతో పోలిస్తే బన్నీ తారక్ లు వేస్టా అంటూ కామెంట్లు పెడుతున్నారు.(Naga Babu)