Naga Chaitanya: సినిమా ఇండస్ట్రీలో ఉండే వారి వ్యక్తిగత జీవితాల విషయాల పట్ల ప్రతి ఒక్కరికి ఎంతో ఆసక్తి ఉంటుంది. ముఖ్యంగా వారి వైవాహిక జీవితాలపై అందరికీ ప్రముఖ ఆసక్తి ఉంటుంది. దానికి తగ్గట్లుగానే సెలబ్రిటీల జీవితాలు ఎన్నో మలుపులు తిరుగుతూ ఉంటాయి. అలా అక్కినేని నాగచైతన్య వ్యక్తిగత జీవితం ఎన్నో మలుపులు తిరుగుతుందని చెప్పవచ్చు. అక్కినేని వారసుడుగా తెలుగు ప్రేక్షకులను కొన్నేళ్ళుగా అలరిస్తూ ఇప్పుడు హీరోగా స్థిరపడ్డాడు. ప్రస్తుతం ఓ పాన్ ఇండియా సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్న నాగచైతన్య పెళ్లి శోభితా దులిపాల్ల తో ఖాయమైంది. ఈ మేరకు ఈరోజు ఎంగేజ్మెంట్ కూడా జరిగింది.
Naga Chaitanya and Sobhita Dhulipala’s Engagement
ఆయన గతంలో హీరోయిన్ సమంత ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరిద్దరూ కలిసి నాలుగు సినిమాలకు పైగా నటించిన నేపథ్యంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించగా అది వివాహంగా మారింది. అయితే వీరి వివాహ బంధం ఎన్నో రోజులు ఉండలేదని చెప్పాలి. ఎంతో సస్పెన్స్ నెలకొన్న వీరి బంధం చివరకు వీగిపోయింది. ఇప్పుడు ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. అయితే కారణాలు ఏమైనా కూడా వీరిద్దరి విడాకులు అక్కినేని అభిమానులను నిరాశపరిచిందని చెప్పాలి.
Also Read: Mrunal Thakur:పెళ్ళైన క్రికెటర్ ని ప్రేమిస్తున్న మృణాల్ ఠాకూర్.. మరి ఆ హీరోయిన్ పరిస్థితి..?
వీరిద్దరి విడాకులు జరిగిన కొద్ది రోజులలోనే నాగచైతన్య మరొక హీరోయిన్ తో డేటింగ్ చేస్తున్నాడన్న రూమర్లు రావడం మొదలవడం అప్పట్లో సెన్సేషన్ గా మారింది. బాలీవుడ్ లో పలు సినిమాలతో ప్రేక్షకులను అలరించిన తెలుగు అమ్మాయి శోభిత ధూళిపాళ్ల తో నాగచైతన్య డేటింగ్ చేస్తున్నాడని వార్తలు అప్పుడు రాగా దీనికి సంబంధించి ఎవరూ కూడా కన్ఫర్మ్ చేయలేదు కానీ వీరిద్దరూ కలిసి తిరుగుతున్న ఫోటోలు మాత్రం బయటకు వచ్చాయి.
ఆ తర్వాత మళ్లీ వీరి ఎఫైర్ గురించి పెద్దగా వార్తలు రాలేదు. కానీ ఇప్పుడు వీరిద్దరికీ ఎంగేజ్మెంట్ జరగడం అందరికి షాక్ కి గురిచేసిందనే చెప్పాలి. తెలుగులో కూడా పలు సినిమాలలో నటించింది శోభిత ధూళిపాళ్ల. మరి వీరిద్దరూ కలిసి ఒక్క సినిమా కూడా చేయని నేపథ్యంలో ఎక్కడ వీరు కనెక్ట్ అయ్యారా అని అభిమానులు ఆరా తీస్తున్నారు. మరి నాగచైతన్య ఏరికోరి మరి చేసుకుంటున్న ఈ పెళ్లి కలకాలం ఉండాలని కోరుకుంటున్నారు.