Naga Chaitanya engagement with that heroine today

Naga Chaitanya: ఎప్పుడైతే నాగచైతన్య సమంతకు విడాకులు ఇచ్చి దూరంగా ఉన్నాడో అప్పటినుండి హీరోయిన్ శోభిత దూళిపాళతో ప్రేమలో ఉన్నాడనే వార్త మీడియాలో ఎంత ఎక్కువ చక్కర్లు కొడుతుందో చెప్పనక్కర్లేదు. నిప్పు లేనిదే పొగ రాదు అన్నట్లు ఇది నిజమే అని చాలా మంది భావిస్తున్నారు. ఎందుకంటే వీరికి సంబంధించిన ఎన్నో ఫోటోలు,వీడియోలు మీడియా లో చక్కర్లు కొట్టాయి. అంతే కాకుండా ఆ మధ్యకాలంలో లండన్ షెఫ్ నాగచైతన్యతో దిగిన ఫొటోస్ షేర్ చేసి ఆ వెనకాలే శోభిత ధూళిపాల ఉంది అని నెటిజన్స్ పసి గట్టడంతో వెంటనే దాన్ని డిలీట్ చేశారు.

Naga Chaitanya engagement with that heroine today

ఇక ఈ ఒక్క విషయంలో వీరి మధ్య నిజంగానే ప్రేమ ఉంది అని బయటపడిపోయింది. అయితే తాజాగా చాలా రోజుల నుండి వీరి పెళ్లి జరగబోతుంది అంటూ వార్తలు వినిపించాయి.కానీ తాజాగా వీరి పెళ్లికి ముహూర్తం ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. ఇక శ్రావణం రావడంతో మంచి రోజులు వచ్చాయి కాబట్టి నాగార్జున ఫ్యామిలీ నాగచైతన్యకు పెళ్లి చేయాలని నిశ్చయించుకుందట.(Naga Chaitanya )

Also Read: Prabhas: ప్రభాస్ ఆ పని చేస్తే మాత్రం చిక్కుల్లో పడ్డట్లే!!

ఇందులో భాగంగా ఈరోజు అనగా గురువారం రోజు నాగచైతన్య శోభిత ధూళిపాలకు ఇంట్లో సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ చేసి శుక్రవారం రోజు వీరి ఎంగేజ్మెంట్ కి సంబంధించిన కొన్ని ఫోటోలను నాగార్జున అధికారికంగా బయట పెట్టబోతున్నట్టు తెలుస్తోంది.ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం సమంత అభిమానుల గుండెలు పగిలినట్టే అంటున్నారు కొంతమంది నెటిజన్స్.

Naga Chaitanya engagement with that heroine today

ఏది ఏమైనప్పటికీ సమంతాతో విడాకులకు కారణం శోభిత ధూళిపాల తో ఉన్న రిలేషనే అని, ఈ కారణంతోనే వీరి మధ్య గొడవలు వచ్చి విడిపోయారని,ఇన్ని రోజులు అందరూ సమంతదే తప్పు అనుకున్నారు. కానీ అసలు తప్పు నాగచైతన్యదే అంటూ కొంతమంది సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ప్రస్తుతం నాగచైతన్య శోభిత ధూళిపాల ఎంగేజ్మెంట్ వార్తలు మీడియాలో చాలా వైరల్ గా మారాయి. మరి వీరి ఎంగేజ్మెంట్ నిజమో కాదో తెలియాలంటే వీరు స్పష్టత ఇవ్వాల్సిందే.(Naga Chaitanya )