Nagachaitanya Thandel Movie Release problems

Naga Chaitanya: అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్న తాజా సినిమా ‘తండేల్’. చందు మొండేటి దర్శకత్వంలో గీత ఆర్ట్స్ బ్యానర్ వారు తెరకెక్కిస్తున్న ఈ సినిమా విడుదల ఇప్పటికీ అయోమయంగా ఉందని చెప్పాలి. చాలా రోజుల క్రితమే మొదలైన ఈ సినిమా ఇప్పటిదాకా ఎందుకు విడుదల చేయకుండా ఉంచారని అక్కినేని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొదట్లో డిసెంబర్ 20వ తేదీన ఈ సినిమా ను విడుదల చేయాలని గతంలోనే నిర్ణయించుకున్నారు. కానీ సడన్ గా రెండు భారీ సినిమాలు అదే నెల లో విడుదల అవడం తో దాన్ని తాలూకు సమీకరణాలు పూర్తిగా మారాయి.

Nagachaitanya Thandel Movie Release problems

అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ‘పుష్ప2’ సినిమా డిసెంబర్ లో రాబోతుంది. సొంత కొడుకు సినిమా విడుదల కాబోతూ ఉండడంతో అల్లు అరవింద్ దానికి పోటీగా తన చిత్రాన్ని విడుదల చేయడం లేదు. పోనీ నెలాఖరులో అయినా విడుదల చేద్దాం అనుకుంటే ఆయన మేనల్లుడు రామ్ చరణ్ హీరోగా నటించిన ‘గేమ్ చేంజర్’ చిత్రం విడుదల ఉంది. ఓవైపు కొడుకు సినిమా ఇంకొకవైపు మేనల్లుడు సినిమా రాబోతూ ఉండడంతో ఈ చిత్రాన్ని డిసెంబర్ లో విడుదల చేయాలా లేదా అన్న మీమాంసలో నిర్మాతలు పడ్డట్టు ఉంది.

Also Read: RaviTeja: ‘మిస్టర్ బచ్చన్’ తర్వాత మరోటి రిలీజ్ కి రెడీ చేసిన మాస్ రాజా!!

దానికి తోడు రెండు పాన్ ఇండియా సినిమాల మధ్య నలిగిపోవడం వారికి ఏమాత్రం ఇష్టం లేదట. అందుకే ఈ సినిమాను ముందుకైనా జరుపుకోవాలి, లేదంటే తర్వాత అయినా విడుదల చేయాలి అని భావిస్తున్నారు.అయితే పోస్ట్ పోన్ చేయడానికి కూడా వీలు లేదు ఇప్పుడు. సంక్రాంతి కి చిరంజీవి సినిమా ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. చిరు నటిస్తున్న ఫాంటసి సినిమా విశ్వంభర మూవీ కి ఎదురెళ్లి తండేల్ ను రిలీజ్ చేయడం నిర్మాతలకు పెద్ద రిస్క్ అనే చెప్పాలి. అలా ఈ సినిమాకు మిగిలిన ఒకే ఒక ఆప్షన్ నవంబర్లోనే విడుదల చేయడం. అయితే ప్రీ పోన్ చేయడానికే నిర్మాతలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తుంది.

‘లవ్ స్టోరీ’ సినిమా తర్వాత నాగచైతన్య సాయి పల్లవి కలిసి నటిస్తున్న రెండవ సినిమా కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తూ ఉండడం విశేషం. ఎన్నో సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉన్న ఈచిత్రం నాగచైతన్యకు కూడా ఎంతో కీలకమైనది. వరుస డిజాస్టర్ లతో సతమతమవుతున్న చైతు ఈ సారి గురి తప్పకూడదనే ఈ చిత్రాన్ని ఎంతో జాగ్రత్తగా చేశాడు. చాలా ఇంపార్టెన్స్ ఇచ్చాడు. చివరికి ఈ సినిమా యొక్క విడుదల ఈ విధంగా ఆగిపోవడం పట్ల ఆయన కూడా నిరాశలో ఉన్నాడు.