Nagarjuna: బిగ్ బాస్..ప్రస్తుతం అన్ని ఇండస్ట్రీలో ఈ షో నడుస్తోంది. కానీ తెలుగు ఇండస్ట్రీలో ఉండే షో చాలా స్పెషల్. ఇప్పటికే ఏడు సీజన్లు పూర్తి చేసుకుని ఎనిమిదవ సీజన్ కూడా రసవత్తరంగా కొనసాగుతోంది. అలాంటి బిగ్ బాస్ గత అన్ని సీజన్లు ఒక లెక్క అయితే ఎనిమిదవ సీజన్ మరో లెక్క అనే విధంగా సాగుతూ అంతా ఉల్టా పల్టాగా ఉంది. అలాంటి బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చినటువంటి ఎంతోమంది కంటెస్టెంట్లు వారం వారం ఎలిమినేట్ అయి బయటకు వస్తున్నారు. కొంతమంది ఎంతగానో ప్రేక్షకులకు దగ్గరయి బయటకు వచ్చి మంచి రెస్పాన్స్ పొందుతుంటే మరి కొంతమంది నెగెటివిటీ మూటగట్టుకుని బయటకు వచ్చి విమర్శలు కూడా అందుకుంటున్నారు.
Nagarjuna has ruined my life Akula Sonia shocking comments
అలాంటి వారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సోనియా ఆకుల. బిగ్ బాస్ హౌస్ నుంచి నాలుగో వారం బయటకు వచ్చింది. అయితే ఆమె హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత బిగ్బాస్ పై నాగార్జున పై విపరీతమైనటువంటి విమర్శలు చేస్తోంది. మరి ఆ వివరాలు ఏంటో చూద్దాం.. నాగార్జున హోస్ట్ గా చేస్తున్నటు వంటి బిగ్ బాస్ షోలోసోనియా ఆకుల టాప్ 5 లో ఉంటుందని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా ఆమె బయటకు రావడంతో ఆశ్చర్య పోయారు. (Nagarjuna)
Also Read: Sumanth: మాజీ భార్య కాపురంలో చిచ్చు పెడుతున్న సుమంత్.. అర్ధరాత్రి ఫోన్లు చేస్తు.?
అయితే దీనిపై స్పందించినటు వంటి సోనియా నా అసలు క్యారెక్టర్ అది కాదని నన్ను పూర్తిగా నెగెటివిటీ రోల్ మాత్రమే బయట చూపించారని చెప్పుకొచ్చింది. బిగ్ బాస్ హౌస్ లో హగ్గులు, సిగరెట్ల గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. వాస్తవానికి నేను హౌస్ లో అందరితో బాగా కలిసిపోయాను. కానీ నేను ఎక్కడైతే సీరియస్ అవుతానో ఆ వీడియోస్ మాత్రమే బిగ్ బాస్ వారు ప్రసారం చేసి నన్ను ఒక విలన్ లా చూపించారు. పృథ్వి నిఖిల్ లను హగ్ చేసుకున్నది జూమ్ చేసి మరీ చూపించారు. అక్కడ మా మధ్య జరిగిన సినారియో మరోరకంగా ఉంటుంది. అంతేకాదు కొంతమంది అమ్మాయిలు హౌస్ లో దారుణంగా ప్రవర్తిస్తారు.
సిగరెట్ కూడా తాగుతారు. కానీ వాళ్ళని చూపించలేదు. నన్నే నెగిటివ్గా చూపించి హైలెట్ చేయడంతో బయట జనాలకు నా క్యారెక్టర్ మరో రకంగా వెళ్ళింది. బిగ్బాస్ వారు చేసిన పనికి నాకు నేనే చాలా బాధపడ్డాను. ఒకవేళ నేను ఏదైనా చేసుకొని చనిపోతే ఎవరు రెస్పాన్సిబులిటీ అని సోనియా ప్రశ్నించింది. నాగార్జున బిగ్ బాస్ అనేది ఒక లైఫ్ మెమొరీ అంటుంటారు.కానీ ఇది లైఫ్ టైం మెమొరీ కాదు నా జీవితంపై మచ్చ వేసే ప్రయత్నం అని చెప్పుకొచ్చారు. వాళ్లకు కావాల్సిన కంటెంట్ కోసం వారు ఏదైనా చేస్తారు ఎవరి జీవితం ఎటు పోయిన వారికి పర్లేదు అంటూ బిగ్ బాస్ పై నిప్పులు చెరిగింది సోనియా.(Nagarjuna)