Nagarjuna suffered torture because of lover

Nagarjuna: టాలీవుడ్ మన్మధుడు అనగానే చాలామందికి గుర్తుకు వచ్చేది నాగార్జున పేరు మాత్రమే. అలాంటి నాగర్జున ఇప్పటికీ ఆరు పదుల వయస్సు దాటినా కానీ 25 ఏళ్ల కుర్రాడిలా కనిపిస్తూ ఉంటారు. అలాంటి ఈయన ఏఎన్నార్ నట వారసత్వాన్ని అందించుకొని ఇండస్ట్రీలోనే స్టార్ హీరోగా ఎదిగారు. నాగార్జున మంచి ఫామ్ లో ఉన్నప్పుడు ఆయనతో చాలామంది హీరోయిన్లకు ఎఫైర్లు ఉండేవని వార్తలు వినిపించేవి. అలా నాగార్జున ఒక హీరోయిన్ వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Nagarjuna suffered torture because of lover

ఆ హీరోయిన్ కు నాగార్జునకు మధ్య ఏదేదో నడిచిందని అప్పట్లో ఊహించుకొని వార్తలు రాసేవారు. మరి నాగార్జున ఏ హీరోయిన్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం.. నాగార్జున అంటే అప్పట్లో ఎక్కువగా ఇష్టపడ్డ హీరోయిన్లలో టబు ముందు స్థానంలో ఉంటుంది అని చాలామంది అనుకుంటారు. ఆమె కాదట. నాగార్జునతో మంచి బాండింగ్ ఏర్పడ్డ హీరోయిన్లలో శ్రియా శరన్ కూడా ఒకరు. నేనున్నాను,ఊపిరి, బాస్, సంతోషం, మనం చిత్రాల్లో శ్రియతో కలిసి నటించాడు. (Nagarjuna)

Also Read: Heroine: ప్రైవేట్ పార్ట్ అందం కోసం ఆ హీరోయిన్ చేసిన పనికి అందరూ షాక్.?

ఇద్దరు చాలా చిత్రాల్లో నటించడం వల్ల ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది. దీంతో వీరి మధ్య ఏదో నడుస్తుందని అప్పట్లో అనేక వార్తలు వచ్చాయి. కానీ ఈ హీరోయిన్ వల్ల నాగార్జున చాలా సమస్యల్లో పడ్డారట. ఈ విషయాన్ని జయప్రద హోస్టుగా వ్యవహరించిన జయప్రదం షోలో బయటపెట్టారు.నాగార్జునను నువ్వు ఏ హీరోయిన్ వల్ల ఎక్కువ ఇబ్బందులు పడ్డావు అని క్వశ్చన్ వేసింది. దీనికి సమాధానం గా నాగార్జున శ్రియ శరన్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పారు. ఆమెతో సినిమా చేసే సమయంలో ప్రతిరోజు లేటుగా వచ్చేది.

Nagarjuna suffered torture because of lover

దీనివల్ల షూటింగ్ సెట్ లోని వారంతా ఆమె కోసం వెయిట్ చేసే వాళ్ళం. అలా మేము ఎన్నిసార్లు మందలించినా ఆమె ప్రవర్తన మార్చుకోలేదు. నేను ఎన్నోసార్లు తిట్టాను. అయినా శ్రీయ మారలేదు. ఆమె షూటింగ్ కు లేట్ రావడం వల్ల చాలాసార్లు నేను ఇబ్బందులు పడ్డ రోజులు ఎన్నో ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఈ షోలో మీరు ఎక్కువగా ఏ హీరోయిన్ తో ఫ్రీగా మాట్లాడేవారు అని అడగగా రమ్యకృష్ణతో మాట్లాడే వాడిని ఆమె ఒక వాగుడు కాయ్ అంటూ చెప్పుకొచ్చారు. అలా నాగార్జున ఆ షోలో చెప్పిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.(Nagarjuna)