Nagarjuna: తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రస్తుతం ఈ పొజిషన్లో ఉంది అంటే దానికి ఒక మూల స్తంభం అక్కినేని నాగేశ్వరరావు అని చెప్పవచ్చు. అలాంటి అక్కినేని ఎంతో కష్టం పడ్డారు.కాబట్టి ప్రస్తుతం వారి ఫ్యామిలీ ఇండస్ట్రీలో నిలబడగలిగింది. ఆయన నటవారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన నాగార్జున అంచలంచెలుగా ఎదిగి సినిమా ఇండస్ట్రీని శాసించే స్థాయికి వచ్చారు.. ఇక అఖిల్ నాగచైతన్య మాత్రం ఇంకా స్టార్ డం కోసం కొట్టుమిట్టాడుతూనే ఉన్నారు.. అలాంటి నాగేశ్వరరావు ఫ్యామిలీ విషయాన్ని పక్కన పెడితే ఆయన చనిపోయినప్పటి నుంచి శతజయంతి ఉత్సవాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి.
Nagarjuna was scared of that star hero
అయితే తాజాగా ఏఎన్ఆర్ నేషనల్ అవార్డు 2024 వేడుకలను అన్నపూర్ణ స్టూడియోలో ఘనంగా నిర్వహించారు. ఈ అవార్డును మెగాస్టార్ గెలుపొందారు. అయితే ఈ అవార్డు సందర్భంగా బాలీవుడ్ బిగ్బి అమితాబ్ బచ్చన్ చేతుల మీదుగా చిరంజీవికి అవార్డు ప్రధానం చేశారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయట పెట్టారు.. ఈ అవార్డు నా స్నేహితుడు చిరంజీవి అందుకోవడం నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని, అలాగే నేను చిన్నప్పటినుంచి ఎంతో ఆరాధించే అభిమానించే హీరో అమితాబ్ బచ్చన్ చేతుల మీదుగా ఇవ్వడం మరింత ఆనందంగా ఉందని తెలియజేశారు.(Nagarjuna)
Also Read: Divorce: టాలీవుడ్ లో యంగ్ హీరో విడాకులు.. భార్యని రెడ్డి హ్యాండెడ్ గా పట్టుకొని..?
కల్కి సినిమాలో అమితాబ్ బచ్చన్ ని చూసి ఆయనకి కాల్ చేసి ఒరిజినల్ మాస్ హీరో బ్యాక్ అని చెప్పానని, ఇప్పటికీ ఆయన చేసిన సినిమాలను చూస్తానని అన్నారు.. అంతేకాకుండా చిరంజీవి గురించి మాట్లాడుతూ.. మెగాస్టార్ తో నాకు ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. ఆయన హిట్లూ రికార్డుల గురించి అందరికీ తెలుసు.అలాంటి చిరంజీవిని ఒకప్పుడు నేను చూసి సినిమా ఇండస్ట్రీలోకి రావద్దు అనుకున్నాను. నేను సినిమాల్లోకి వచ్చే సమయంలో నాన్నగారు సినిమాల్లోకి నువ్వు రావాలంటే షూటింగ్స్ ఎలా నటిస్తున్నారో చూసి నేర్చుకోమని అన్నపూర్ణ స్టూడియో కి పంపారు.
అప్పుడే చిరంజీవి సినిమా షూటింగ్ జరుగుతోంది. చిరంజీవి మరియు రాధా కలిసి ఒక రేన్ సాంగ్ షూట్ జరుగుతోంది. ఈ టైంలో చిరంజీవి గారి నటన గ్రేస్, డాన్స్ చూసి నా మనసులో గుబులు పుట్టింది.. వెంటనే సినిమాల్లోకి కాకుండా వేరే దారి వెతుక్కుందామని, అలా నటించడం మనతో కాదని అనుకున్నానని నాగార్జున చెప్పారు. ప్రస్తుతం ఆయన చెప్పిన మాటలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.(Nagarjuna)