Nagarjuna: అక్కినేని నాగార్జున తెలుగు సినిమా ఇండస్ట్రీ చరిత్రలోనే మరపురాని హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇండస్ట్రీలోకి వచ్చిన ఈయన తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ సొంతం చేసుకొని ఇప్పటికీ కుర్ర హీరోలకు పోటీ ఇస్తూ సినిమాల్లో దూసుకుపోతున్నారు.. అలాంటి నాగర్జున సినిమా విషయాలు పక్కన పెడితే ఆయన ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో కూడా తన తండ్రికి విపరీతంగా భయపడేవాడట.. అంతేకాదు తండ్రికి భయపడి కొన్ని చిలిపి పనులను కూడా చాలా సీక్రెట్ గా చేసేవాడట..
Nagarjuna who went into the forest without the knowledge of his father
అలా ఒక ఇంటర్వ్యూలో ఆయన తన జీవితంలో చేసినటువంటి కొన్ని కొంటె పనులను అభిమానులతో పంచుకున్నాడు.. అవేంటో ఇప్పుడు చూద్దాం.. సినిమా ఇండస్ట్రీలోని సెలబ్రిటీలందరికీ ఆల్కహాల్ తీసుకోవడం అనేది కామన్.. ప్రస్తుత కాలంలో సెలబ్రిటీలు వారి పిల్లలు అంతా కలిసి ఒకే దగ్గర కూర్చొని ఆల్కహాల్ తీసుకుంటుంటారు.. కానీ నాగార్జున చిన్నతనంలో మాత్రం ఇలాంటి ఫ్రీడమ్ ఉండేది కాదట.. (Nagarjuna)
Also Read: Mahesh Babu: ఆ హీరోయిన్ తో మహేష్ లిప్ లాక్.. ఇంటికి వచ్చాక నమ్రత ఏం చేసిందో చూడండి.?
తన తండ్రి ఏఎన్ఆర్ చాలా స్ట్రిక్ట్ గా పెంచారట. అల్లరి చిల్లరగా మాట్లాడడం బయటకు వెళ్లి చిల్లర పనులు చేయడం లేట్ నైట్ వరకు ఇంట్లో లేకుండా పోవడం వంటివి చేస్తే ఆయన చాలా కోపానికి వచ్చే వారట.. ఆయన ఎంత స్ట్రిట్ గా ఉన్న నాగార్జున మాత్రం ఆయనకు తెలియకుండా చాలా చిలిపి పనులు చేసేవాడట. అలా చేసి చివరికి పేరెంట్స్ కి దొరికిపోయేవారట.. నాగార్జునకు కూడా బీరు తాగే అలవాటు ఉందట..
అయితే తన తండ్రికి తెలిస్తే కోప్పడతాడని ఆయన సీక్రెట్ గా అన్నపూర్ణ స్టూడియోలోనే ఖాళీ ప్లేస్ లో తాగేవాడట.. అయితే స్టూడియోలో కొంత ఫారెస్ట్ ను తలపిస్తుంది.. అయితే అక్కడికి ఒక బీర్ బాటిల్ పట్టుకొని ఎవరికి కనిపించకుండా చెట్ల పొదల్లోకి వెళ్లి తాగేసి వచ్చే వారట.. ఈ విధంగా కొన్నాళ్లపాటు తండ్రికి తెలియకుండా మెయింటైన్ చేస్తూ వచ్చారట నాగార్జున.. ఈ విషయాన్ని ఒక ప్రెస్ మీట్ లో ఆయన చెప్పుకొని అప్పటి రోజులను గుర్తు చేసుకున్నాడు.. ప్రస్తుతం నాగార్జున 60 సంవత్సరాల వయసు వచ్చినా కానీ సినిమాల్లో దూసుకుపోతున్నారు..(Nagarjuna)