Namitha: అర్ధరాత్రి ఊరి చివర బంగ్లా వింటుంటేనే చాలా భయం గా అనిపిస్తుంది. ఎందుకంటే ఊరి చివర బంగ్లా అర్ధరాత్రి అంటే సినిమాలో చూపించే కొన్ని దయ్యం కథలు మన మైండ్లో మెదులుతాయి.అయితే అలాంటి ఊరి చివర బంగ్లాలో హీరోయిన్ నమిత ఏం చేసింది..రహస్యంగా ఆ పని ఎందుకు చేసింది అనేది ఇప్పుడు చూద్దాం.. సౌత్ లో హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకొని అప్పటి యూత్ క్రష్ గా మారిపోయిన నమిత గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు.
Namitha did that secretly in the bungalow
ఈమె తెలుగులో సొంతం,జెమిని,ఓ రాధా ఇద్దరు కృష్ణుల ప్రేమకథ, బిల్లా వంటి సినిమాల్లో నటించింది. అయితే ఈమె తెలుగులో కంటే ఎక్కువగా తమిళంలోనే నటించింది. అలా తమిళ ప్రేక్షకులకు ఆరాధ్య దైవంగా మారిపోయిన నమిత గురించి అప్పట్లో ఒక విషయం వైరల్ గా మారింది.అదేంటంటే నమిత ఆమె ఉండే ఊరిలోని ఊరి చివర బంగ్లాకి అర్ధరాత్రి పూట వెళ్లేదట. (Namitha)
Also Read: Prabhas: బికినీ వేసుకున్నందుకు ఆ హీరోయిన్ చెంప చెల్లుమనిపించిన ప్రభాస్.?
అయితే ప్రతిరోజు ఇలా నమిత వెళ్లడం చూసి కొంతమంది మీడియా వాళ్ళు ఈమె ఎక్కడికి వెళ్తుంది ఏం చేస్తుంది అని తెలుసుకోవడానికి స్ట్రింగ్ ఆపరేషన్ మొదలుపెట్టారు.అయితే ఈ ఆపరేషన్లో భాగంగా నమిత ఆ ఊరి చివర బంగ్లాలో ఏం చేస్తుందో తెలుసుకున్న మీడియా వాళ్ళు షాక్ అయిపోయారు. మరి ఇంతకీ నమిత చేసిన పనేంటయ్యా అంటే సాల్సా డాన్స్.. అవును మీరు వినేది నిజమే.
నమిత సన్నగా తయారయ్యి మళ్ళీ సినిమాల్లో అవకాశాల కోసం సాల్సా డ్యాన్స్ నేర్చుకుందట. అలా ఇంట్లో కాకుండా వెరైటీగా ఊరి చివరలో ఉండే ఒక బంగ్లాలో ఓ టీచర్ సహాయంతో సాల్సా డ్యాన్స్ నేర్చుకుని సన్నబడింది. అలా మీడియా వాళ్ళు చేసిన స్ట్రింగ్ ఆపరేషన్లో ఈ విషయం తెలియడంతో ఈ విషయం మీడియాలో వైరల్ అవ్వడంతో అప్పట్లో ఇది పెద్ద సెన్సేషన్ సృష్టించింది.(Namitha)