Namitha: తమిళ ప్రేక్షకుల ఆరాధ్య దైవమైన నమితకి తాజాగా ఒక చేదు అనుభవం ఎదురయింది. ఆమెని లోపలికి వెళ్ళనివ్వకుండా చిత్రవధ చేశారంటూ ఎంతో నామూషీగా ఫీలైన ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో వీడియో విడుదల చేసి మరీ తన ఆవేదన వెల్లగక్కింది. మరి ఇంతకీ నమితకు జరిగిన అవమానం ఏంటి.. ఆమెను ఎక్కడికి వెళ్ళనివ్వలేదు అనేది ఇప్పుడు చూద్దాం. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా తమిళంలో సెన్సేషన్ సృష్టించిన నమిత తెలుగులో కూడా నాలుగైదు సినిమాల్లో నటించింది.
Namitha: They tortured her by not letting her in
కానీ తెలుగులో కంటే నమితకి తమిళంలోనే ఎక్కువ ఆఫర్స్ వచ్చాయి.అలా నమిత కోలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా మారింది. అంతే కాదు ఈమె నటన మెచ్చిన కొంతమంది వీరాభిమానులు గుడి కూడా కట్టించారు.అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ భారీగా బరువు పెరిగిపోవడంతో అవకాశాలు తగ్గాయి. ఆ తర్వాత ప్రేమలో విఫలం అవ్వడం,ఆఫర్స్ తగ్గిపోవడం వంటివి ఈమె జీవితంలో ఎన్నో డిప్రెషన్ కి వెళ్లేలా దారితీశాయి. (Namitha)
Also Read: Kajal Aggarwal: బికినీ వేసుకో కోట్లు ఇస్తా అంటూ కాజల్ ని టార్చర్ చేసిన ప్రొడ్యూసర్..?
ఆ తర్వాత నమిత వీరేంద్రని పెళ్లాడి ఇద్దరు కవల పిల్లలకు కూడా జన్మనిచ్చింది.అయితే ఈ ముద్దుగుమ్మ తాజాగా కృష్ణాష్టమి సందర్భంగా చెన్నైలోని మధుర మీనాక్షి ఆలయాన్ని తన కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించడానికి వెళ్లిందట.కానీ ఆలయ పాలకులు మాత్రం ఆమెను లోపలికి రానివ్వకుండా అక్కడే అడ్డుకున్నారట. చాలాసేపు ఆమెను అలానే బయట అడ్డుకొని మీ సర్టిఫికెట్స్ చూపించండి అన్నారట.
దాంతో అవమానంగా ఫీలైన నమిత ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ తనతో అసభ్యంగా మాట్లాడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.కానీ నమిత వ్యాఖ్యలకు ఆలయ పాలకవర్గం స్పందిస్తూ.. నమిత మాట్లాడిన దాంట్లో ఎలాంటి నిజం లేదు. మేము పై అధికారులు ఫోన్ చేశాక కాసేపు ఆగమని చెప్పాము. ఆ తర్వాత గుడిలోకి ఆహ్వానించామంటూ క్లారిటీ ఇచ్చారు.(Namitha)