Nani: తెలుగు ఇండస్ట్రీలో బ్యాగ్రౌండ్ లేకుండా ఎదిగిన హీరోలలో నాని కూడా ఒకరు.. ఈయన ఏ పాత్రలో చేసిన చాలా న్యాచురల్ గా చేస్తారు. అందుకే నానిని న్యాచురల్ స్టార్ అని పిలుస్తుంటారు. అలాంటి నాని తక్కువ బడ్జెట్ లో అద్భుతమైన సినిమాలు చేసి సూపర్ హిట్లు అందుకుంటూ ఉంటారు. ఆయన కెరియర్ లో ఎక్కువ హిట్లు, తప్ప ఫ్లాపులు అనేవి లేవు. అలా నాని కెరియర్ మంచి పొజిషన్ లో దూసుకుపోతున్న తరుణంలో తాజాగా హీరో రానా హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఒక షోకు హాజరై తన వ్యక్తిగత, ప్రేమ, పెళ్లి విషయాన్ని బయటపెట్టారు.
Nani love story like that before marriage
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేను నా వైఫ్ అంజనను పెళ్లి చేసుకోవడం ఒక కల. వారి ఫ్యామిలీ మొత్తం విద్యావేత్తలు. వారు నన్ను వారి ఫ్యామిలీలో ఓన్ చేసుకుంటారని నేను అనుకోలేదు..నా భార్య అంజనా ప్రముఖ శాస్త్రవేత్త ఎలవర్తి నాయుడమ్మ గారి మనవరాలు.. అయితే నా భార్య దగ్గర నాయుడమ్మ గారి డైరీ ఓసారి చూశాను.. అందులో ఆయన నేను ఈరోజు శ్రీమతి ఇందిరాగాంధీని కలిసాను, ఎన్టీఆర్ తో నా అల్పాహారం పూర్తయింది అంటూ రాసుకున్నారు.. (Nani)
Also Read: Venkatesh: బావ బామ్మర్దులు అవ్వాల్సిన వెంకటేష్ రాజశేఖర్.. కానీ ఎక్కడ చెడిందంటే.?
అలాంటి విద్యావేత్తలు, శాస్త్రవేత్తలు ఉన్న ఫ్యామిలీ నుంచి అంజనాను చేసుకోవడం నా అదృష్టం.. అయితే నేను ఇండస్ట్రీలోకి రాకముందే అంజనాతో ప్రేమలో పడ్డాను. చివరికి ఆమెను వివాహం చేసుకోవడం ఒక కలలా అనిపించింది.. నా ప్రేమ పెళ్లి వరకు వెళుతుందని నేను అస్సలు భావించలేదు ఎందుకంటే, సినిమా ఇండస్ట్రీ అంటే గాలిలో పెట్టిన దీపం.. ఎదిగితే పూర్తిగా ఎదుగుతారు, లేదంటే పాతాళానికి పడిపోతాం.
ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన తర్వాత నా ప్రేమ ఉంటుందో, ఊడుతుందో అని భావించాను. నాకు అంజనా కుటుంబ సభ్యులు సపోర్టుగా నిలిచి నన్ను అర్థం చేసుకున్నారు. ఆ ఫ్యామిలీ మొత్తం విద్యావేత్తలే.. అయినా నన్ను అర్థం చేసుకుని అంజనాను నాకు ఇచ్చి వివాహం చేశారు. అప్పుడు నా సందేహాలన్నీ క్లియర్ అయిపోయి నా లైఫ్ గాడిలో పడిందని తెలియజేశారు.. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.(Nani)