Nani: నాచురల్ స్టార్ నాని అంటే ప్రస్తుతం దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్న హీరో. ఈయనకి కేవలం మన దేశంలోనే కాదు ఇతర దేశాల్లో కూడా ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ఇక దసరా,హాయ్ నాన్న వాటి సినిమాలతో నాని పేరు ఎక్కడికో వెళ్లిపోయింది.అయితే అలాంటి నాని పర్సనల్ కెరియర్ లో కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఆయన అంజనని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరి అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా ఒక బాబు కూడా ఉన్నారు.
Nani Love with that heroine
అయితే అలాంటి నాని అంజనా కంటే ముందే మరో హీరోయిన్ ని పెళ్లి చేసుకోవాలనుకున్నారు అంటూ ఆ మధ్య కాలంలో టాలీవుడ్ సర్కిల్స్ లో ఒక రూమర్ వినిపించింది.. అదేంటంటే.. నాని తన సినిమాలో హీరోయిన్ గా చేసిన ఒక హీరోయిన్ తో పీకల్లోతూ వరకు ప్రేమలో మునిగిపోయారని, ఆ హీరోయిన్ ని నాని పెళ్లి చేసుకుంటారని కూడా ఒక గాసిప్ వినిపించింది. ఇక ఆ హీరోయిన్ ఎవరో కాదు మలయాళీ బ్యూటీ నిత్యా మీనన్.. (Nani)
Also Read: Ram Charan: గేమ్ ఛేంజర్ విషయంలో రామ్ చరణ్ అభిమానులకు మళ్ళీ నిరాశ తప్పదా?
నాని నిత్యామీనన్ కాంబినేషన్లో అలా మొదలైంది సినిమా వచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమాతో నానికి నిత్యామీనన్ కి టాలీవుడ్ లో చాలా క్రేజ్ వచ్చింది.ఈ సినిమా హిట్ తో వీరిద్దరి పేరు ఇండస్ట్రీలో మార్మోగిపోవడమే కాదు ఎఫైర్ వార్తల్లో కూడా వినిపించింది. ఈ సినిమాలో చేసే సమయంలో వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగి డేటింగ్ చేశారనే టాక్ కూడా వినిపించింది.
అయితే నాని నిత్యామీనన్ పెళ్లి వార్తలు మీడియాలో గట్టిగా వినిపించాయి కానీ ఇవి రూమర్స్ గానే మిగిలిపోయాయి. అయితే ఇండస్ట్రీకి వీరిద్దరు అప్పుడే ఎంట్రీ ఇవ్వడంతో వీరి పై ఆ రూమర్స్ వినిపించాయి. కానీ ఇందులో ఎలాంటి నిజం లేదు. ఇక నాని నిత్యమీనన్ ని పెళ్లి చేసుకుంటారని కూడా కొన్ని రూమర్లు వినిపించినప్పటికీ అది నిజం కాలేదు.చివరికి నాని అంజనని పెళ్లి చేసుకున్నారు నిత్య మీనన్ ఇంకా పెళ్లి కాకుండా సింగిల్ గానే ఉంటుంది.(Nani)