Nara Rohith: నారా ఫ్యామిలీ అంటే చాలామందికి గుర్తుకు వచ్చేది రాజకీయాలు మాత్రమే. నారా చంద్రబాబు ఇప్పటికే చాలా పర్యాయాలు తెలుగు రాష్ట్రాలకి సీఎంగా సేవలందించారు. ప్రస్తుతం ఏపీ రాష్ట్రానికి సీఎంగా ఉన్నారు. అలాంటి నారా ఫ్యామిలీ నుంచి కేవలం రాజకీయాల్లోనే కాకుండా సినిమాల్లో కూడా రాణించేవాళ్ళున్నారు. ఆయన కూడా మనందరికీ తెలుసు.. ఇంతకీ ఆయన ఎవరయ్యా అంటే నారా రోహిత్.. అలాంటి ఈయన తెలుగులో పలు చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు.
Nara Rohith is secretly dating that heroine
మాస్ యాక్షన్ కమర్షియల్ చిత్రాల్లో ఎదురులేదనిపించుకుంటున్నాడు.. అలాంటి నారా రోహిత్ కెరియర్లో బెస్ట్ మూవీ గా నిలిచింది ప్రతినిధి. ఈ సినిమా హిట్ అవడంతో దీనికి సీక్వెల్ గా ప్రతినిధి -2 సినిమా కూడా తీసుకువచ్చారు. అయితే ఈ సినిమాలో నారా రోహిత్ సరసాన సిరి లేళ్ళ కథానాయకగా చేసింది. అలా సినిమా షూటింగ్ లో ఏర్పడినటువంటి వీరి పరిచయం చివరికి ఓ మహిళ వల్ల వివాహం వరకు వెళ్లిందట. మరి ఆమె ఎవరు ఆ వివరాలు ఏంటో చూద్దాం.. (Nara Rohith)
Also Read: Gopichand Vishwam: యూట్యూబ్ ను షేక్ చేస్తున్న గోపీచంద్ ‘విశ్వం’ సినిమాలోని “గుంగురు గుంగురు” పాట!!
నారా రోహిత్ పెళ్లి విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి భువనేశ్వరి కీలకమైన పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఆమె ప్రతినిధి 2 సినిమా చూసినప్పుడే సిరి లేళ్లతో రోహిత్ జోడి బాగుందని భువనేశ్వరి అనుకున్నదట. అంతేకాదు రెండు కుటుంబాలతో మాట్లాడి పెళ్లి కూడా ఖాయం చేసిందట.
అయితే ఒక హీరో హీరోయిన్ పెళ్లి చేసుకుంటున్నారు అంటే బయట లొకేషన్స్ అక్కడక్కడ తిరిగి మీడియా కంటపడి చివరికి నానా రచ్చ అయిన తర్వాత పెళ్లి చేసుకుంటూ ఉంటారు. అలాకాకుండా నారా భువనేశ్వరి మాత్రం ముందుండి వీరి జోడిని అర్థం చేసుకొని ఇరు కుటుంబాలతో మాట్లాడిందట. అయితే వీరి పెళ్లి విషయం పై అధికారిక ప్రకటన రాకపోయినా కానీ, ఈ వారంలోనే ఎంగేజ్మెంట్ కూడా జరిగే అవకాశం కనిపిస్తుందట. అయితే సిరి లేళ్ళ ప్రతినిధి -2 చిత్రంలో తప్ప ఇంకో చిత్రంలో ఇప్పటివరకు నటించలేదు.(Nara Rohith)