Naveen Vijay Krishna: విజయనిర్మల తనయుడు నరేష్ అంటే అందరికీ సుపరిచితమే. ఈయన సినిమాల్లో హీరోగా మొదలుపెట్టి క్యారెక్టర్ ఆర్టిస్ట్ వరకు ఏ పాత్ర అయినా సరే అలవోకగా చేస్తారు. మరీ ముఖ్యంగా ఈయన తనకి ఇచ్చిన ప్రతి పాత్రలో జీవించి పోతారు. అందుకే నరేష్ కి సినిమాల్లో మంచి ఇమేజ్ క్రియేట్ అయింది. ఈయన ఏ పాత్ర ఇచ్చినా సరే అందులో ఒదిగిపోయి నటించడం వల్ల నరేష్ కి టాలీవుడ్ లో చేతి నిండా అవకాశాలు ఉంటాయి. అయితే అలాంటి నరేష్ గత రెండు సంవత్సరాల నుండి సోషల్ మీడియాలో డిజిటల్ మీడియాలో ఎక్కడ చూసినా సరే ఎక్కువగా వైరల్ అవుతున్నారు.
Naveen Vijay Krishna sensational comments on Naresh
దానికి ప్రధాన కారణం నటి పవిత్ర లోకేష్ తో ఈయన సహజీవ**మే.. ఇకవీరిద్దరి వ్యవహారంలో జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు.అయితే ప్రస్తుతం ఇది చాలా వరకు సర్దు మనిగిపోయింది.అయితే నరేష్ ఇప్పటికే నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నారు. కానీ నరేష్ పెద్ద కొడుకు నవీన్ విజయ్ కృష్ణ ఇప్పటివరకు ఒక్క పెళ్లి కూడా చేసుకోలేదు.అంతేకాదు ఆయన వయసు కూడా ఇప్పటికే 40 ఏళ్లు. దాంతో చాలామంది జనాలు తండ్రి నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడు. (Naveen Vijay Krishna )
Also Read: Naresh-Pavitra: నరేష్ పవిత్ర లు పిల్లల్ని కనబోతున్నారా.. బయట పడ్డ సంచలన నిజం.?
కానీ కొడుకుకి 40 ఏళ్లు వచ్చినా కూడా ఒక్క పెళ్లి కాలేదు అంటూ కూడా ట్రోల్స్ చేస్తున్నారు. అయితే ఈ విషయంపై తాజాగా నటుడు అయినటువంటి నవీన్ విజయ్ కృష్ణ మాట్లాడుతూ.. మా తండ్రి నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడు అంటే అది ఆయన పర్సనల్ విషయం. దాని గురించి ట్రోల్ చేస్తే నేను అస్సలు పట్టించుకోను. చాలామంది నరేష్ నాలుగు పెళ్లిళ్ల విషయం చూస్తున్నారు. కానీ ఆయన ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అనే విషయాన్ని మాత్రం ఎవరు గుర్తించారు. ఎందుకంటే అవి ఎవరికి తెలియదు కాబట్టి. ఇక నాకు ఇప్పుడు 40 ఏళ్లు..అయితే పెళ్లి చేసుకోవడానికి ఎంతో సమయం పట్టదు.
కానీ పెళ్లయ్యాక అండర్స్టాండింగ్ లేక విడాకులు తీసుకునే కంటే రైట్ పర్సన్ ని ఎంచుకొని పెళ్లి చేసుకోవడం మంచిది. అందుకే ఏజ్ ని చూడడం లేదు మంచి అమ్మాయి కోసమే చూస్తున్నాను. ఇక ట్రోల్స్ అనేవి చాలా మంది చేస్తూ ఉంటారు. నేను కూడా ట్రోల్స్ చేస్తూ ఉంటాను. కానీ ఇలాంటి విషయాలపై ట్రోల్స్ చేయను అంటూ నవీన్ విజయ్ కృష్ణ తన తండ్రి నాలుగు పెళ్లిళ్ల విషయంపై తన పెళ్లి విషయంపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. ఇక నవీన్ కృష్ణ ప్రస్తుతం ఎడిటర్ గా చేస్తున్నారు. గతంలో రెండు మూడు సినిమాల్లో హీరోగా చేసినప్పటికీ అవి ప్లాప్ అవ్వడంతో హీరోగా ఈయన నిలదొక్కుకోలేకపోయారు.(Naveen Vijay Krishna )