Devara: జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్‌ను శాసిస్తోంది. ‘RRR’ వంటి బ్లాక్‌బస్టర్ విజయానంతరం వచ్చిన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి, అవి నిజం చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ డ్రామా, ఎన్టీఆర్ పవర్ఫుల్ నటన, కథనంలోని అద్భుతమైన మలుపులు, యాక్షన్ సన్నివేశాలతో అభిమానులను కట్టిపడేస్తోంది.
Netflix Had Rights for Devara in Multiple Languages
ఇప్పటి వరకు ఈ చిత్రం దాదాపు రూ. 400 కోట్లకు పైగా వసూలు చేసింది. బాక్సాఫీస్ వద్ద పెద్ద సినిమాలతో పోటీ లేకపోవడంతో, ట్రేడ్ విశ్లేషకులు ఈ సినిమాను 500 కోట్ల క్లబ్లో చేరడం ఖాయమని అంచనా వేస్తున్నారు. ఎన్టీఆర్ నటనతో పాటు, కొరటాల శివ దర్శకత్వ ప్రతిభ కూడా ఈ విజయంలో కీలక పాత్ర పోషించాయి.
Also Read: Telangana: రైతు రుణమాఫీ పై ప్రభుత్వం కీలక ప్రకటన.. ఇకపై రేషన్ కార్డు!!
ఈ సినిమా డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. నెట్‌ఫ్లిక్స్, తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోనూ స్ట్రీమింగ్ చేయనుంది. ఈ హక్కుల కోసం ఏకంగా రూ. 155 కోట్లను చెల్లించినట్లు సమాచారం. థియేటర్లలో సినిమా చూడలేకపోయిన ప్రేక్షకులు, ఓటీటీలో ఈ సినిమా ఎప్పుడు రానుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
సినిమా థియేటర్లలో విడుదలైన 50 రోజుల తర్వాత, దీపావళి కానుకగా నవంబర్ 15న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుందని అంచనా. త్వరలోనే చిత్ర యూనిట్ ఓటీటీ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించనుంది.