Telangana: తెలంగాణ రాష్ట్రంలో మరో కొత్త అసెంబ్లీ భవనానికి శ్రీకారం చుట్టేందుకు రేవంత్ రెడ్డి సన్నద్ధం అయినట్లు తెలుస్తోంది. తాజాగా తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇదే ప్రకటన చేశారు. తెలంగాణలో కొత్త అసెంబ్లీ భవనాన్ని నిర్మించబోతున్నట్లు వివరించారు. నిజాం నిర్మించిన భవనం తరహాలోనే తెలంగాణ అసెంబ్లీ కొత్త భవనం నిర్మిస్తామని… మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. Telangana
New assembly building in Telangana Revanth sensational decision
ఏకంగా 49 కోట్లతో కొత్త అసెంబ్లీ నిర్మిస్తామని… ఆయన తాజాగా ప్రకటన చేయడం జరిగింది. పార్లమెంటు తరహాలోనే అసెంబ్లీ, కౌన్సిల్ ఒకే దగ్గర ఏర్పాటు చేస్తామని కూడా మంత్రి కమిటీ రెడ్డి వెంకట్ రెడ్డి వివరించారు. అదే తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొత్త అసెంబ్లీ ప్రకటన నేపథ్యంలో…. ప్రతిపక్షాలు సెటైర్లు వేస్తున్నాయి. Telangana
Also Read: Rohit Sharma: న్యూజిలాండ్ చేతిలో ఓటమి..రోహిత్ కు భారీ శిక్ష ?
హైదరాబాద్ నగరంలో కూల్చివేతలు చేసుకుంటూ… రియల్ ఎస్టేట్ వ్యవస్థను దెబ్బతీసిన రేవంత్ రెడ్డికి … ఇప్పుడు కొత్త అసెంబ్లీ భవనం నిర్మాణం ఎందుకు అంటూ నిలదీశారు. మూసి పేరుతో లక్ష 50 వేల కోట్లు అంటూ రచ్చ చేస్తున్నారని మండిపడ్డారు గులాబీ పార్టీ నేతలు. అలాగే తెలంగాణ కొత్త అసెంబ్లీ పేరుతో మరో 50 కోట్లు ఎందుకని నిలదీశారు. రైతులకు… అలాగే పెన్షన్లకు డబ్బులు లేవు కానీ… కొత్త అసెంబ్లీ ఇప్పుడు అవసరమా అని ప్రశ్నించారు. మొదటగా… 6 గ్యారంటీలు అమలు చేసి మిగతా పనులు చూసుకోవాలని చురకలాంటించారు.