Nikhil: చాలామంది హీరోలు సినిమాల్లో డైలాగులు చెప్పడానికి చూడ్డానికి బాగానే ఉంటారు. కానీ బయట వారి నిజస్వరూపం వేరేగా ఉంటుంది. అయితే ఇది నేను అంటున్న మాట కాదు.ఇండస్ట్రీ జనాలతో పాటు బయట సమాజంలో ఉన్న జనాలు అంటున్న మాట.అయితే చాలామంది హీరోలు తమకు ఇష్టమైన వారితో డేటింగ్ చేస్తూ ఉంటారు. అలా కొంతమంది డేటింగ్ వర్క్ అవుట్ అయితే పెళ్లిక వరకు వెళ్తుంటారు.
Nikhil love that heroine before marraige
కొంతమంది ఏమో మధ్యలోనే డ్రాప్ అయిపోతూ ఉంటారు.ఇక ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన నిఖిల్ కూడా అప్పట్లో ఓ హీరోయిన్ తో చెట్టపట్టాలేసుకొని తిరిగినట్టు వార్తలు గుప్పుమన్నాయి. ఇక నిఖిల్ తో డేటింగ్ చేస్తున్నట్టు వార్తలు వినిపించిన హీరోయిన్ ఎవరో కాదు కలర్స్ స్వాతి.. వీరి కాంబోలో వచ్చిన స్వామి రారా, కార్తికేయ వంటి రెండు సినిమాలు హిట్ అయ్యాయి. (Nikhil)
Also Read: Simbu and Nidhi Agarwal: నిధి అగర్వాల్ , శింబు ల ప్రేమ పెళ్లి.. కోలీవుడ్ లో ఇదే హాట్ టాపిక్!!
అయితే వీరిద్దరూ చాలా క్లోజ్ గా ఉండడంతో ఇద్దరి మధ్య ఏదో నడుస్తుంది అని టాలీవుడ్ మీడియా మొత్తం కోడై కూయడంతో ఈ రూమర్లు ఇండస్ట్రీలో వైరల్ అయ్యాయి. అయితే ఈ వార్తలపై ఇండస్ట్రీ జనాలకు క్లారిటీ ఇచ్చినప్పటికీ బయట ఈ విషయంపై ఎక్కడా మాట్లాడలేదు ఈ జంట.అయితే చాలా రోజులు నిఖిల్, కలర్స్ స్వాతి డేటింగ్ చేసినట్టు కూడా కొన్ని ఫోటోలు,వీడియోలు చక్కర్లు కొట్టాయి.
కానీ ఇవన్నీ కేవలం సినిమా షూటింగ్ స్పాట్ లో ఉన్న సమయంలో దిగిన ఫోటోలు, వీడియోలు అని, అందులో తప్పుగా అర్థం చేసుకోవాల్సిన పనిలేదు అని కొంతమంది నిఖిల్ స్వాతిల అభిమానులు చెప్పారు. కానీ నిఖిల్ పల్లవి వర్మను ప్రేమించే కంటే ముందే స్వాతి రెడ్డి తో ఎంజాయ్ చేశారనేది మాత్రం ఇండస్ట్రీలో బలంగా వినిపించిన వార్త.కానీ ఆ తర్వాత చిన్న చిన్న కారణాలతో ఇద్దరి మధ్య గొడవ జరిగిందట.దాంతో వీరిద్దరికి బ్రేకప్ జరిగింది.(Nikhil)