Nivetha Pethuraj: నివేతా పేతురాజ్. యంగ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా చేసిన పాగల్, దాస్ కా ధమ్కీ అనే రెండు సినిమాల ద్వారా స్టార్ స్టేటస్ తెచ్చుకుంది.ఇక ఈమె తెలుగులో మెంటల్ మదిలో అనే మూవీ తో ఎంట్రీ ఇచ్చింది.ఆ తర్వాత బ్రోచేవారెవరురా, చిత్రలహరి వంటి సినిమాల్లో నటించినప్పటికీ అంతగా గుర్తింపు అయితే రాలేదు.అలాగే అల్లు అర్జున్ హీరోగా చేసిన అల వైకుంఠపురం సినిమాలో బన్నీ మరదలు అంటే సుశాంత్ మరదలు పాత్రలో నటించింది.
Nivetha Pethuraj sensational comments on plastic surgery
ఇక ఈమెకు పాగల్,దాస్ కా ధమ్కి సినిమాలు హిట్ ఇవ్వడంతో యంగ్ హీరోల సరసన బెస్ట్ ఛాయిస్ గా ఈమెను కొంతమంది దర్శకులు ఎంపిక చేశారు. అయితే ఈ మధ్యకాలంలో సినిమాలు లేకపోవడంతో వెబ్ సిరీస్ లకి కూడా ఈ ముద్దుగుమ్మ ఓకే చెబుతోంది.అలా తాజాగా ఈ ముద్దుగుమ్మ నటించిన పరువు అనే వెబ్ సిరీస్ ఓటిటి లో స్ట్రీమింగ్ అవుతూ మంచి టాక్ తెచ్చుకుంది. అలాగే ఈ వెబ్ సిరీస్ లో నాగబాబు కీలక పాత్ర చేశారు.ఇక మెగా డాటర్ సుస్మిత కొణిదెల ఈ వెబ్ సిరీస్ నిర్మించింది.(Nivetha Pethuraj)
Also Read: Bahubali: బాహుబలి మూవీ ని బోడి సినిమా అంటూ వెక్కిరించిన స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ భార్య.!
అయితే ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నీవేతా ప్లాస్టిక్ సర్జరీ గురించి తనకి ఎదురైన ఒక అనుభవాన్ని అభిమానులతో పంచుకుంది. నివేతా పేతురాజ్ అందరు హీరోయిన్లాగే తను కూడా కూడా ఓ పార్ట్ కు సర్జరీ చేయించుకోవాలి అనుకున్నదట. అది కూడా తన లిప్స్ కి.. ప్లం లిప్స్ కావాలి అనే ఆశ ఆమెకు ఎక్కువగా ఉండేదట.అందుకోసమని తన ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి వెళ్లి ఆ సర్జరీ చేయించుకుంటానని చెప్పిందట. ఇక నివేత పేతురాజ్ మాటలకి డాక్టర్ కోప్పడి ఆ సర్జరీ చేయించుకుంటే నిన్ను చంపేస్తాను అని వార్నింగ్ ఇచ్చారట.
అంతేకాదు అందం కోసం చేయించుకునే ఈ సర్జరీలు ఇప్పుడు బాగానే ఉంటాయి కానీ ఆ తర్వాత లైఫ్ లో ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుంది అని అన్ని విషయాలు పూర్తిగా చెప్పారట.దీంతో అప్పటినుండి ప్లాస్టిక్ సర్జరీలకి ఇతర సర్జరీలకి దూరంగా ఉంటూ వస్తుందట నీవేత పేతురాజ్.అంతే కాదు ఎలాంటి సర్జరీలు చేయించుకోకుండా కూడా హీరోయిన్లు స్టార్ స్టేటస్ పొందుతారు. అలాంటి వారిలో నిత్యామీనన్,సాయి పల్లవిలు ఉన్నారు అని ఉదాహరణ కూడా చెప్పింది.అంతే కాదు ఈ హీరోయిన్లు ఇప్పటివరకు ఏ సర్జరీ చేయించుకోలేదు అలాగే మేకప్ కూడా ఎక్కువగా వాడరు అయినా కూడా వీరికి ఇండస్ట్రీలో మంచి గుర్తింపు దొరికింది కదా అంటూ మాట్లాడింది.(Nivetha Pethuraj)