Aryaman Birla: క్రికెట్ లో ప్రతిభ చాటిన కొద్దీ ఆటగాళ్ల సంపాదన పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు దాదాపు ప్రతి ఒక్క క్రికెటర్ కోట్లలో పారితోషకం తీసుకుంటున్నారు. విదేశీ క్రికెటర్ల కన్నా భారత క్రికెటర్లే ఎక్కువగా డబ్బులను సంపాదిస్తున్నారు. క్రికెటర్లలో విరాట్ కోహ్లీ, ధోని అత్యధిక ధనవంతులని ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు. వీరి సంపాదన కోట్లలో ఉంటుంది. Aryaman Birla
Not Dhoni or Kohli, Meet India’s Richest Cricketer Aryaman Birla
కానీ ధోని, కోహ్లీ కన్నా అత్యధిక ఆదాయం కలిగిన క్రికెటర్ ఆర్యమన్ బిర్లా. ఇతడు ప్రముఖ వ్యాపారవేత్త కుమారుడు మంగళం బిర్లా కుమారుడు. ఇతడు దేశంలోనే కాదు ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెటర్ గా నిలిచాడు. దేశంలోనే అత్యంత సంపన్న వ్యాపారవేత్తలలో కుమార్ మంగళం బిర్లా ఒకరు. అతడి కుమారుడే ఆర్యమన్ బిర్లా. Aryaman Birla
Also Read: IPL 2025: RCB వదులుకునే ఆటగాళ్లు వీళ్లే…మ్యాక్సీ తో పాటు డుప్లెసిస్ ?
ఆర్యమన్ వ్యాపారంతో పాటు క్రికెట్ లోను రాణిస్తున్నాడు. 2017లో క్రికెట్ లోకి అరంగేట్రం చేసిన ఆర్యమన్ బిర్లా మధ్యప్రదేశ్ తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెటర్ గా నిలిచాడు. అయితే 2019లో క్రికెట్ అనూహ్యంగా వీడ్కోలు పలికాడు. తన 22 ఏళ్ల వయసులోనే బిర్లా క్రికెట్ నుంచి విరామం తీసుకోవడం గమనార్హం. Aryaman Birla
అయితే ఆర్యమన్ మానసిక ఆరోగ్య సమస్యల కారణంగా క్రికెట్ కు వీడ్కోలు పలికినట్లుగా సమాచారం. ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లలో 16 ఇన్నింగ్స్ లు ఆడాడు. 27.60 సగటుతో 414 పరుగులు చేశాడు. క్రికెట్ వర్గాల సమాచారం ప్రకారం ఆర్యమన్ బిర్లాకు దాదాపు రూ. 70,000 కోట్ల ఆస్తులు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా అతడి కార్లు, వాచీలు వంటివి కలిపితే 80 వేల కోట్లకు పైనే ఉంటాయని సమాచారం. Aryaman Birla