Oben Rorr E-bike: మన భారతదేశ మార్కెట్లో అనేక రకాల వాహనాలు ఉన్న సంగతి తెలిసిందే. దీనికి తోడు రకరకాల కొత్త బైక్స్ మార్కెట్లోకి వస్తున్నాయి. టు వీలర్ అలాగే ఫోర్ వీలర్ కు సంబంధించిన వాహనాలు ఈ మధ్య కాలంలో ఎక్కువగానే రిలీజ్ అవుతున్నాయి. దేశవ్యాప్తంగా పెట్రోల్ అలాగే డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో… ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరిగింది. Oben Rorr E-bike
Oben Rorr electric bike offered with a discount of Rs 40,000
దీంతో ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీలు తక్కువ ధరకు వాహనాలను…విక్రయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. రకరకాల డిస్కౌంట్ ప్రకటిస్తున్నాయి. అయితే తాజాగా ఓ బైక్ పై ఏకంగా 40 వేల డిస్కౌంట్ ప్రకటించింది ఓ స్టార్టప్ కంపెనీ. బెంగళూరు నగరానికి చెందిన… ఒబేన్ ఎలక్ట్రిక్ స్టార్ట్ అప్ కంపెనీ తమ బైక్ పై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. Oben Rorr E-bike
Also Read: Skoda New Kodiaq: స్కోడా నుంచి మరో కొత్త కారు..ధర, ఫీచర్లు ఇవే..!
ఇటీవల obenn Rorr ఎలక్ట్రిక్ బైక్ ను మార్కెట్ లోకి తీసుకువచ్చింది ఈ బెంగళూరు స్టార్ట్ అప్ కంపెనీ. వాస్తవానికి దీని ధర 1.10 లక్షలు గా ఉంది. ఇది ఎక్స్ షోరూం ధర మాత్రమే. అయితే ఢిల్లీలో… తమ మొదటి వంద మంది కస్టమర్లకు… ఈ బైక్ ను డిస్కౌంట్ రూపంలో అందించనుంది. ఈ మొదటి వందమంది కస్టమర్లకు 40 వేల రూపాయల డిస్కౌంట్ తో ఈ బైక్ విక్రయించనుంది కంపెనీ. Oben Rorr E-bike
ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది. మెయిన్ బ్రాంచ్ బెంగళూరు అయినప్పటికీ… ఢిల్లీలో విక్రయాలను జోరుగా పెంచేందుకు ప్రయత్నాలు చేస్తోంది. మరి ఈ బైక్.. ఫీచర్స్ ఒకసారి పరిశీలిస్తే… ఈ బైకు ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్ పెడితే 187 కి.మీ మైలేజ్ అందిస్తుంది. అంతేకాకుండా ఈ బైక్ మూడు సెకండ్లలో 40 స్పీడ్ అందుకుంటుంది. ఇప్పటికే కొచ్చి, త్రివేండ్రంలో కొత్త షోరూమ్ లోను ప్రారంభించిన ఈ కంపెనీ… ఈ ఏడాది చివరిలోగా 12 నగరాలలో తమ షోరూమ్‌లను ఓపెన్ చేసేందుకు రంగం సిద్ధం చేసింది. Oben Rorr E-bike