OnePlus Nord CE 4 Lite: ఇండియన్ మార్కెట్లో అనేక రకాల మొబైల్ ఫోన్స్ వస్తున్న సంగతి తెలిసిందే. ఎక్కడ చూసినా ఎవరి చేతిలో అయినా సరే… కచ్చితంగా స్మార్ట్ ఫోన్ ఉండటం మనం గమనిస్తున్నాం. ఒకరి చేతిలో ఒక మొబైల్ ఫోన్ కంటే రెండు లేదా మూడు ఉంటున్నాయి. దేశవ్యాప్తంగా మొబైల్ ఫోన్ల ధరలు… తక్కువ ఉండడం, దానికి తోడు డిస్కౌంట్లు ప్రకటించడంతో చాలా మంది మొబైల్ ఫోన్స్ విపరీతంగా అనుకుంటున్నారు. OnePlus Nord CE 4 Lite
OnePlus Nord CE4 Lite launching today in India
అయితే ఇలాంటి నేపథ్యంలో వన్ ప్లస్ కంపెనీ నుంచి… సరికొత్త మొబైల్ ఫోన్ వచ్చింది. వన్ ప్లస్ నార్డ్ సీఈ 4 లైట్ 5జి మొబైల్ ఫోను తాజాగా తీసుకువచ్చింది కంపెనీ. ఈ కొత్త మొబైల్ ఫోన్ ధర వచ్చేసి 20వేల రూపాయల వరకు ఫిక్స్ చేశారు. అంటే 8gb రామ్ మరియు 128 జిబి స్టోరేజ్ ఉన్న మొబైల్ ఫోను 20,000 నుంచి ప్రారంభం అవుతుంది. OnePlus Nord CE 4 Lite
Also Read: Redmi Note 13 Pro 5G: మరొక కొత్త కలర్లో రెడ్మీ ఫోన్.. ధర, ఫీచర్స్ ఇవే..!
అయితే 8 జిబి రామ్ విత్ 250gb స్టోరేజ్ ఉన్న ఫోన్ 23 వేల రూపాయల వరకు ఉంది. ఈనెల 27వ తేదీ నుంచి మార్కెట్లో లభిస్తాయి. అంతేకాదు ఈ వన్ ప్లస్ ఫోన్ల డిస్ప్లే 6.67 అంగుళాలు ఉంటుంది. 80 వాట్స్ పవర్ ఉన్న చార్జర్ మాత్రమే దీనికి సపోర్ట్ చేస్తుంది. అలాగే దీని బ్యాటరీ సామర్థ్యం 5500 mah గా ఉంటుంది. OnePlus Nord CE 4 Lite
వన్ ప్లస్ బ్యాక్ కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సల్ గా ఫిక్స్ చేశారు. సెల్ఫీల కోసం 16 మెగాపిక్సల్ కెమెరాను అందిస్తున్నారు. ఇక ఈ వన్ ప్లస్ నార్ద్ సి ఇ ఫోర్ లైట్ ఫోన్ కు హెడ్ ఫోన్ జాక్ తో పాటు స్టీరియో స్పీకర్లు కూడా వస్తున్నాయి. ఆండ్రాయిడ్ 14 బేస్డ్ ఆక్సిజన్ ఓఎస్ 14 వర్షం పై ఈ మొబైల్ ఫోన్ పనిచేస్తుంది. ఇక ఈ సూపర్ ఫోన్ మూడు రంగుల్లో మాత్రమే మనకు లభిస్తుంది. అందులో ఆరేంజ్, బ్లూ ఇక సిల్వర్ కలర్ ఉన్నాయి.