Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ నేపథ్యంలో…టీమిండియా వర్సెస్ పాకిస్థాన్ దేశాల మధ్య వివాదం రాజుకుంటోంది. అయితే.. తాజాగా భారత్ – శ్రీలంకలో జరిగే 2026 టీ20 వరల్డ్ కప్ ను ఆడబోమని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు బీసీసీఐని హెచ్చరించినట్లు పాకిస్తాన్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. 2025 సంవత్సరంలో పాకిస్తాన్ లో ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహించనున్నారు. ఈ టోర్నమెంట్ కోసం టీమిండియా పాకిస్తాన్ కు వెల్లబోమని చెబుతున్నాయి. Champions Trophy
Pakistan warnings to India We will host the Champions Trophy in our country whether they come or not
భారత్ మ్యాచ్ లను హైబ్రిడ్ పద్ధతిలో దుబాయ్ లేదా శ్రీలంక వంటి తటస్థ వేదికల వేదికల్లో నిర్వహించాలని బీసీసీఐ ….. ఐసీసీని కోరినట్లు తెలుస్తోంది. జూలై 19 నుంచి 22 వరకు శ్రీలంకలో జరగనున్న ఐసీసీ వార్షిక సమావేశంలో ఈ అంశాన్ని చర్చకు తీసుకురానున్నారట. ఒకవేళ ఈ అంశం చర్చకు వస్తే దీనిని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వ్యతిరేకించాలని నిర్ణయించుకుందని వార్తలు వస్తున్నాయి. Champions Trophy
Also Read: Ms Dhoni: ధోనీని హగ్ చేసుకున్న అంబానీ కోడలు..ఫోటోలు వైరల్ !
అన్ని మ్యాచ్ లు పాకిస్తాన్ లోనే జరిగి తీరాలా…. హైబ్రిడ్ పద్ధతిని వ్యతిరేకించాలని ఫిక్స్ అయ్యారట. ఒకవేళ భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాకిస్తాన్ కు రాకపోతే పాకిస్తాన్ 2026 టీ20 వరల్డ్ కప్ కోసం భారత్ కు రాకూడదని నిర్ణయించుకుందని కూడా వార్తలు వస్తున్నాయి. Champions Trophy
2025 లో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీని భారత్ ఆడకపోతే ఆ స్థానంలో ఐసీసీ ర్యాంక్స్ ప్రకారం శ్రీలంకకు అవకాశం దక్కుతుంది. టీమిండియా చివరిసారిగా 2008 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ తో ఆడింది. అనంతరం రెండు జట్లు కేవలం ఐసీసీ టోర్నమెంట్ లో మాత్రమే తలబడ్డాయి. Champions Trophy