Pakisthan: మహిళల టీ20 ప్రపంచకప్ 2024 ప్రారంభమైంది. ఈ టోర్నీలో పాకిస్తాన్ జట్టు తన తొలి మ్యాచ్ శ్రీలంకతో ఆడింది. ఈ మ్యాచ్ లో ఘన విజయం సాధించడంతో మాకు జట్టు తొలి అడుగు అద్భుతంగా మారింది. ఇదే ఉత్సాహంతో టీమ్ ఇండియాతో తలపడేందుకు సిద్ధమైంది. కానీ ఆ తర్వాత టీమ్ ఇండియా చేతిలో ఓడింది. Pakisthan

Pakistan Womens Cricketers Salaries

న్యూజీలాండ్ తో కూడా పాక్ ఓడిపోయి…ఇంటి దారి పట్టింది. ఇది ఇలా ఉండగా.. పాక్ మహిళా క్రికెటర్లకు ఎంత జీతం లభిస్తుందన్నది అభిమానుల మదిలో మెదులుతున్న ఓ పెద్ద ప్రశ్న. పాకిస్తాన్ మహిళా క్రికెటర్లకు మూడు కేటగిరీల్లో జీతాలు ఇస్తారు. A, B, C. కానీ జూన్ 2024 నుంచి పాకిస్తాన్ ఆటగాళ్లకు ఎటువంటి జీతం రావడం లేదు. Pakisthan

Also Read: IND vs NZ 2024: టెస్టు సిరీస్… హాట్‌స్టార్‌లో రాదు! ఫ్రీగా ఎలా చూడాలంటే..?

పాకిస్తాన్ మహిళా క్రికెటర్లు ప్రస్తుతం టెస్ట్ ఆడే దేశాలన్నింటిలో అత్యంత వేతనం పొందుతున్న అథ్లేట్లలో ఉన్నారు. మీడియా నివేదికల ప్రకారం, పాకిస్తాన్ మహిళా క్రికెటర్లకు A కేటగిరిలో ప్రతినెల 120,000 పాకిస్తానీ రూపాయలు (36,301 భారతీయ రూపాయలు) ఇస్తారు. పాకిస్తాన్ లోని B కేటగిరిలోని మహిళ మహిళ క్రీడాకారుల జీతం 94,800 పాకిస్తానీ రూపాయలు (28,677 భారతీయ రూపాయలు). C కేటగిరిలోని ఆటగాళ్లకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు 70,800 పాకిస్తాన్ రూపాయలు (21,417 భారత రూపాయలు) అందజేస్తుంది. Pakisthan