Pawan Kalyan Criticizes Own Government

Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏది చేసినా సంచలనమే. ప్రస్తుతం తన సొంత ప్రభుత్వంపైనే విమర్శలు గుప్పిస్తూ, ఏపీ హోం మంత్రి తీరుపై పవన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. గత కొన్ని రోజులుగా ఏపీలో జరుగుతున్న రేప్ ఘటనలపై పవన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నారులపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయని, ప్రభుత్వం ఈ విషయంలో విఫలమైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Pawan Kalyan Criticizes Own Government

“ఇన్ని దారుణాలు జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదు,” అంటూ పవన్ పోలీస్ వ్యవస్థను ఉద్దేశిస్తూ సూటిగా ప్రశ్నలు సంధించారు. పోలీసుల కులపరమైన వివక్షతను ప్రస్తావిస్తూ, తప్పు చేసిన వారిని కులం పేరుతో విడిచిపెట్టకూడదని హెచ్చరించారు. ఇది ప్రభుత్వంపై ఒత్తిడిని సూచిస్తున్నట్టుగా పవన్ వ్యాఖ్యలు రికార్డులపై నడుస్తున్నాయి.

Also Read: Chandrababu: ఏపీకి లోకేష్ సీఎం.. ప్రధానమంత్రి గా చంద్రబాబు.. వైసీపీ సంచలన నిజం!!

తన విమర్శలు హోం మంత్రి అనితపైనా చేయడం ఆపలేదు. పవన్. ఏపీలో జరుగుతున్న రేప్ ఘటనలకు హోం మంత్రి అనిత బాధ్యత వహించాలని, ఆమె తన పదవి నుంచి వైదొలగాలని ఆయన పరోక్షంగా సూచించారు. తాను హోం మంత్రిగా ఉంటే పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉండేదని, తాను యోగీ ఆదిత్యనాథ్ తరహా పవర్ ఫుల్ హోం మంత్రిగా వ్యవహరించగలనని పేర్కొన్నారు.

మొదట కూటమి ఏర్పాటైనప్పుడు పవన్‌కు హోం శాఖ మంత్రిత్వం ఇవ్వాలని అనుకున్నప్పటికీ, చంద్రబాబు పంచాయితీ రాజ్ శాఖను అప్పగించారు. అయినప్పటికీ, పవన్ కొన్ని కీలక అంశాలపై నిశితంగా స్పందిస్తూనే ఉన్నారు. లడ్డూ వివాదం, సంస్కృతి పరిరక్షణ వంటి అంశాలలోనూ తన దృఢతను ప్రదర్శించారు. ఈ పరిణామాల నేపథ్యంలో పవన్ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. హోం శాఖ మంత్రి అనిత తనపై వచ్చిన విమర్శలకు ఎలా స్పందిస్తారన్నది కూడా ఆసక్తిగా మారింది.