Pawan Kalyan: కొణిదెల పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమా హీరో మాత్రమే కాదు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను శాసించేవాడు. ఆయన పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచి డిప్యూటీ సీఎం పదవిని,మంత్రి పదవిని పొందారు. అయితే ప్రస్తుతం ఆయనపై ఎన్నో బాధ్యతలు ఉన్నాయి. ఈయన్ని నమ్ముకుని ఎంతో మంది పేద ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇక ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజల వద్దకే పాలన అనే విధంగా ఆయన ప్రతి ఒక్కరి మెప్పు పొందే విధంగా పరిపాలన చేయాలి.

Pawan Kalyan would have created a rift between the two and would have enjoyed

ఇదంతా పక్కన పెడితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఒక సీక్రెట్ విషయం ఇప్పుడు తెలుసుకుందాం. అదేంటంటే పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీకి రాకముందు ఎన్నో ఇబ్బందులు పడ్డారట. అయితే ఆయన కి ఉండే అనారోగ్య సమస్యల వల్ల సూసైడ్ కూడా చేసుకోవాలనుకున్నారట. ఇదంతా పక్కన పెడితే పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీ కి రాకముందు తన అక్కలు, అన్నయ్యల పిల్లల్ని పట్టుకునేవారు.(Pawan Kalyan )

Also Read: Samantha: డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేసిన సమంత,నయనతార కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

అలా సాయి ధరమ్, తేజ్,వైష్ణవ్ తేజ్,సుస్మిత,శ్రీజ రామ్ చరణ్ లను చూసుకునే వారట. అయితే ఆ టైంలో పవన్ కళ్యాణ్ కి కాస్త ఎంటర్టైన్మెంట్ ఉండటం కోసం ఆయన సుస్మితకి రామ్ చరణ్ కి మధ్య చిన్న చిన్న గొడవలు పుట్టించి ఇద్దరు కొట్టుకునేలా చేసేవారట. ఇక వారిద్దరూ కొట్టుకుంటూ ఉంటే చూస్తూ ఎంజాయ్ చేసేవారట. అలా చిన్నతనంలో ఇలాంటి చిలిపి పనులు ఎన్నో చేసే వారట.

Pawan Kalyan would have created a rift between the two and would have enjoyed

అంతేకాకుండా రామ్ చరణ్ కి ఇచ్చే పాకెట్ మనీ కూడా పవన్ కళ్యాణ్ ఏవేవో మాటలు చెప్పి తీసుకునేవారట. అంతేకాదు నీకు మళ్ళీ పూర్తిగా వడ్డీ తో సహా తిరిగి ఇచ్చేస్తాను అని అనేవారట.అలా రామ్ చరణ్ కి చిన్నతనంలో పవన్ కళ్యాణ్ తో ఇలాంటి స్పెషల్ మూమెంట్స్ ఎన్నో ఉన్నాయట. ఇక ఈ విషయాన్ని రామ్ చరణ్ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.(Pawan Kalyan )