Pensions: ఏపీలో ఎన్టీఆర్ భరోసా పేరుతో పెన్షన్ల పంపిణీని ప్రారంభించింది ప్రభుత్వం. రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమం జరుగుతోంది. అయితే తాము అధికారంలోకి వస్తే 4000 పెన్షన్ అందిస్తామంటూ ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం ఏర్పడగానే అందించిన మొదటి పెన్షన్ ఇదే. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే తొలి సంతకాల్లో పెన్షన్ పంపిణీ కూడా ఉన్న విషయం తెలిసిందే. ఆ తర్వాత క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో గత మూడు నెలలకు 1000 చొప్పున నాలుగు వేలుతో కలిసి 7వేల పెన్షన్ మొత్తాన్ని అందిస్తోంది.
Pensions distributed by chandra babu
దీంతో రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. ఇంకోపక్క పెన్షన్ల పంపిణీకి స్వయంగా రంగంలోకి దిగారు చంద్రబాబు. మంగళగిరి నియోజకవర్గంలో పెనుమాకలో చంద్రబాబు నాయుడు పెన్షన్ పంపిణీ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ కూడా పాల్గొన్నారు. అధికారులతో పాటుగా గ్రామానికి చేరుకున్న సీఎం లబ్ధిదారు ఇంటికి వెళ్లి స్వయంగా పెన్షన్ ఇచ్చారు. లబ్ధిదారు కుటుంబ సభ్యులతో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపండి ప్రారంభించిన చంద్రబాబు మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలోని పెనుమాకలో స్వయంగా ఇస్లావత్ సాయి అనే మహిళకు వితంతు పెన్షన్ బాణావత్ పాముల నాయక్ అనే వ్యక్తికి వృద్ధాప్య పెన్షన్ ఇచ్చారు గతం కంటే భిన్నంగా చంద్రబాబు నాయుడు పర్యటన సాగింది.
Also read: Tasty Teja: డ్రైవింగ్ చేస్తూ అవేం పనులు భయ్యా.. టేస్టీ తేజ పై ఫైర్ అవుతున్న నెటిజన్స్..!
గ్రామంలో ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించి ముందుకు సాగారు. గ్రామంలోని యువకులతో ఫోటోలు దిగి భుజం తట్టి పంపించారు తర్వాత పెనుమాక గ్రామ ప్రజా వేదిక వద్దకు చేరుకున్నారు. పెనుమాకలో ప్రజలతో మాటా మంతీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గ్రామస్తులు సమస్యలు అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబు ఇలా ఎప్పట్లా కాకుండా కాస్త కొత్తగా ఈ పర్యటన చేశారు ప్రతి ఒక్కరిని కూడా ఆప్యాయంగా పలకరిస్తున్నారని యువకులతో ఫోటోలు దిగి భుజం తట్టి పంపించారని ప్రజలే స్వయంగా చెబుతున్నారు. పెనుమాక గ్రామ ప్రజా వేదిక వద్దకు ఆయన చేరుకుని అక్కడ ప్రజలతో మాటా మంతి కార్యక్రమంలో పాల్గొన్నారు (Pensions).