Phone Charging: ఈరోజుల్లో ప్రతి ఒక్కరు కూడా స్మార్ట్ ఫోన్ ని ఎక్కువగా వాడుతున్నారు. ఫోన్ లో ఈజీగా అన్ని పనులు అయిపోతూ ఉంటాయి. ఈ యుగంలో జీవితం కూడా స్మార్ట్ గా మారింది స్మార్ట్ ఫోన్లపై ప్రజలను పెరుగుతూ వచ్చింది. అన్ని పనులు కూడా ఫోన్లోనే జరుగుతూ ఉంటాయి ఫోన్ లో పెరుగుతున్న బిజీ కారణంగా చార్జ్ చేయడం చాలా ముఖ్యం. ఛార్జ్ చేయకపోతే స్మార్ట్ ఫోన్ కేవలం బాక్స్ గా మిగిలిపోతుంది. స్మార్ట్ఫోన్ ని ఎలా ఛార్జ్ చేయాలనే విషయాన్ని చాలా మంది పట్టించుకోరు. కానీ నిజానికి ఇలా స్మార్ట్ఫోన్ ని ఛార్జ్ చేయకపోతే ఫోన్ పాడయ్యే అవకాశాలు ఉంటాయని టెక్ నిపుణులు అంటున్నారు. దీని కోసం మీరు ఎల్లప్పుడూ ఓ నియమాన్ని పాటించాలి. అసలు ఆ నియమం ఏంటి..? ఎలా పాటించాలి అనేది ఇప్పుడు చూద్దాం.

Phone Charging tips

ఫోన్ బ్యాటరీ చాలా ముఖ్యం. బ్యాటరీ చెడిపోవడం ప్రారంభిస్తే ఫోన్ కూడా పాడైపోతుంది అందువలన ఫోన్ చార్జింగ్ కోసం కొన్ని నియమాలని అనుసరించాలి. తద్వారా ఫోన్ త్వరగా పాడైపోదు. వాస్తవానికి ఫోన్ బ్యాటరీ జీరో శాతానికి చేరుకున్నప్పుడు మాత్రమే ఛార్జ్ చేయాలని చాలామంది భావిస్తూ ఉంటారు. కానీ అది సరైన పద్ధతి కాదు అదే టైంలో అది 100% చేయాలనుకుంటారు. మీరు కూడా ఇలా చేస్తుంటే పొరపాటే. ఫోన్ బ్యాటరీ పూర్తిగా డిశ్చార్జ్ చేయకూడదని లేదా పూర్తిగా చార్జ్ చేయకూడదని నిపుణులు చెప్పారు.

Also read: Fridge: ఫ్రిజ్‌లో వేడి పదార్థాలు పెడితే ఏమవుతుందో తెలుసా..?

ఎప్పుడైనా సరే ఫోన్ చార్జింగ్ చేసేటప్పుడు 80:20 నిష్పత్తిని గుర్తుంచుకోవాలి. దీని అర్థం బ్యాటరీ శాతం 20 వద్ద ఉన్నప్పుడు ఛార్జ్ చేయాలి అలాగే 80 శాతానికి రాగానే డిశ్చార్జ్ చేయాలి దీనిని 80:20 నిష్పత్తి అని అంటారు. నిపుణులు బ్యాటరీని 90% వరకు ఛార్జ్ చేయొచ్చని చెప్తుంటారు. మీరు ఈ నియమాన్ని పాటిస్తే బ్యాటరీ లైఫ్ పెరుగుతుంది ఫోన్ ఛార్జ్ లో పెట్టి ఉపయోగించడం ప్రారంభించే వారు చాలామంది ఉన్నారు. ఇది అసలు చేయకూడదు. ఫోన్ ని ఛార్జ్ చేసేటప్పుడు మీరు కంపెనీ నుండి అందుకున్న చార్జర్ ని మాత్రమే ఉపయోగించాలి. చార్జర్ దెబ్బతిన్నట్లయితే మీరు కంపెనీ చార్జర్ ని మాత్రమే కొనుగోలు చేయాలి (Phone Charging).