PM Modi: భారత ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశం అభివృద్ధి పథంలో దూసుకెళ్తోంది. ప్రపంచంలోనే నంబర్ వన్ స్థానంలో నిలువడం లక్ష్యంగా భారతదేశం వివిధ రంగాల్లో ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా సంప్రదాయ కళలను ప్రోత్సహించడం, కళాకారుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం ముఖ్య ఉద్దేశంగా ‘విశ్వకర్మ యోజన’ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా దేశంలోని అనేక ప్రాంతాల్లో ఉన్న హస్తకళాకారులకు అవసరమైన ఆర్థిక సహాయం అందించడం, వారి నైపుణ్యాలను ప్రోత్సహించడం ప్రధాని మోదీ ముఖ్య లక్ష్యంగా తీసుకున్నారు.
PM Modi Launches Vishwakarma Yojana
2023 సెప్టెంబర్ 17న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమ పుట్టినరోజు సందర్భంగా ఈ విశ్వకర్మ యోజన పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకానికి భారతీయ సంప్రదాయ కళలను ఆధునికంగా తీర్చిదిద్దడమే కాకుండా, ప్రపంచమంతటా హస్తకళాకారుల ప్రతిభను చాటిచెప్పడమే ముఖ్య ఉద్దేశం. ఇప్పటికే ఈ పథకం ద్వారా దాదాపు 23 లక్షల మంది హస్తకళాకారులు లబ్ధి పొందారు. ఈ పథకం వారికి ఆర్థికంగా బలం కల్పించడంతో పాటు, వారి నైపుణ్యాలు ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందేందుకు అవకాశమిస్తుంది.
Also Read: New OTT Releases: ఈ వారం ఓటీటీలో భారీ విందు..సినిమాలు, వెబ్ సిరీస్‌ల పండగ!!
విశ్వకర్మ యోజన కింద హస్తకళాకారులకు అతి తక్కువ వడ్డీ రేటుతో రుణాలు పొందే అవకాశం కల్పిస్తున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ దాదాపు రూ. 3 లక్షల వరకు రుణం పొందే అవకాశం ఉంది. ఇప్పటికే దాదాపు 11 లక్షల మంది కళాకారులు ఈ పథకం కింద రుణాలు పొందారు. కమ్మరి, గోల్డ్ స్మిత్, శిల్పి, వడ్రంగి వంటి 18 రకాల హస్తకళలను ప్రోత్సహించేలా రూపొందించిన ఈ పథకం ద్వారా కళాకారులకు వారి రంగాల్లో కొనసాగేందుకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఈ పథకం కోసం రూ. 551.8 కోట్ల రుణాలను మంజూరు చేసింది.
విశ్వకర్మ యోజన పథకం ద్వారా కళాకారుల జీవితాల్లో సానుకూల మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వారి కళలను మరింతగా అభివృద్ధి చేసుకోవడానికి, ఉత్పత్తులను మెరుగుపరచడానికి, వ్యాపారాన్ని విస్తరించడానికి ఈ పథకం తోడ్పడుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. ఈ పథకం ద్వారా హస్తకళాకారులు తమ కళను ప్రపంచానికి చాటిచెప్పే అవకాశం పొందుతుండటంతో పాటు, దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతోంది.