KTR: కొడంగల్ రైతుల దాడి వెనుక… గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ఉన్నట్లు… కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఛానల్ లు అలాగే సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతోంది. రెండు రోజుల కిందట.. కొడంగల్ వెళ్ళిన కలెక్టర్ ప్రతీక్ పైన రైతులు దాడి చేసిన సంగతి తెలిసిందే. కొడంగల్ నియోజకవర్గంలో ఫార్మా సిటీ ఏర్పాటుకు వ్యతిరేకంగా రైతులు నిరసన తెలుపుతున్నారు. KTR

Police Case On KTR

అయితే వాళ్లను అక్కడి నుంచి పంపించేందుకు… కలెక్టర్ తో పాటు అధికారులు అక్కడికి వెళ్లారు. ఈ తరుణంలోనే అందరూ ఏకమై… కలెక్టర్ తో పాటు అధికారులపై దాడి చేయడం జరిగింది. అయితే రైతుల్లో గులాబీ పార్టీ, భారతీయ జనతా పార్టీ నేతలు కూడా ఉన్న సంగతి తెలిసిందే. అయితే దీని వెనక… కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి తో పాటు ఆయన అనుచరులు ఉన్నారని వార్తలు వచ్చాయి. KTR

Also Read: KTR Slams Revanth Reddy: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అరెస్ట్‌పై కేటీఆర్ ఆగ్రహం..రేవంత్ కుట్ర!!

ఇందులో భాగంగానే కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి తో పాటు… చాలామంది గులాబీ పార్టీ నేతలను, రైతులను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా… రిమాండ్ రిపోర్ట్ కూడా విడుదల చేశారు. అయితే కల్వకుంట్ల తారక రామారావు ఆదేశాల మేరకు ఈ దాడి చేసినట్లు… రిమాండ్ లో గులాబీ నేతలు చెప్పినట్లు వార్తలు ప్రచురణ అవుతున్నాయి. దీంతో కేటీఆర్ కు కూడా నోటీసులు ఇస్తారని ప్రచారం చేస్తున్నారు. KTR