Mahesh Babu: ప్రస్తుతం ఇండియాలో ఉన్న చాలా మంది సినీ ప్రేక్షకుల చూపంత మహేష్ బాబు పైనే ఉంది. ఎందుకంటే ఈయన పాన్ ఇండియా డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు.అయితే ఈ సినిమా ఇప్పటివరకు రాజమౌళి తీసిన సినిమాల కంటే ఎక్కువ రేంజ్ లో అంటే పాన్ వరల్డ్ రేంజ్ లో ఉంటుందని ఇప్పటికే ఎన్నో ఇంటర్వ్యూలలో కొంతమంది బయటపెడుతున్నారు. అంతేకాకుండా రాజమౌళి కూడా ఈ విషయాన్ని బయట పెట్టేశారు. దాంతో ప్రస్తుతం మహేష్ బాబు పైనే అందరి చూపు ఉంది.అయితే అలాంటి మహేష్ బాబుని ఆ సినిమా చేస్తే బాగుండదు అంటూ ఓ రాజకీయ నాయకుడు వార్నింగ్ ఇచ్చారట.
Politician who gave a strong warning to Mahesh Babu
మరి ఇంతకీ ఆయన ఎవరు? ఎందుకు వార్నింగ్ ఇచ్చారు..మహేష్ బాబు చేసిన తప్పేంటి అనేది ఇప్పుడు చూద్దాం.. సూపర్‌స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా ఈ ఏడాది విడుదలై ఓకే టాక్ తెచ్చుకుంది. అయితే భరత్ అనే నేను సినిమా అందరూ చూసే ఉంటారు.ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మహేష్ బాబు ఒక రాజకీయ నాయకుడు తనకు ఇచ్చిన వార్నింగ్ గురించి బయట పెట్టారు. అదేంటంటే.. మహేష్ బాబు ఆగడు సినిమా అందరూ చూసే ఉంటారు. అయితే ఈ సినిమా భారీ అంచనాల మధ్య వచ్చి ప్లాఫ్ అయింది.(Mahesh Babu)
Also Read: Mahesh Babu: మహేష్ సినిమా ఫ్లాప్.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు!!
ఇక ఈ సినిమా చూసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మహేష్ బాబుకు ఫోన్ చేసి ఏంటి ఆగడు సినిమా ఇలా చేశావు. ఇలాంటి చెత్త సినిమాలు ఇంకొకసారి చేయకు అంటూ వార్నింగ్ ఇచ్చారట.అయితే ఈ వార్నింగ్ ఇవ్వడానికి ప్రధాన కారణం మహేష్ బాబు,కేటీఆర్ లు మంచి ఫ్రెండ్స్ అనే విషయం అందరికీ తెలుసు. ఇక కేటీఆర్ మహేష్ బాబుకి సంబంధించిన ప్రతి ఒక్క సినిమా చూస్తారట. అలా ఆగడు సినిమా చూసిన సమయంలో తనకి నచ్చకపోవడంతో ఇలా మొహం మీదే చెప్పేశారట.
ఇక మహేష్ బాబు కూడా తన సినిమా విడుదల అవుతుంది అంటే కేటీఆర్ ఎలాంటి రివ్యూ ఇస్తాడో అని భయపడదాడట. బాగుంటే బాగుంటుందని లేకపోతే అస్సలు బాలేదని మొహం మీద చెప్పేస్తారట.అందుకే తన సినిమా రిలీజ్ అయిన టైంలో కేటీఆర్ ఫోన్ చేస్తే మహేష్ బాబు భయపడుకుంటేనే ఫోన్ లిఫ్ట్ చేస్తారట. అయితే ఈ విషయాన్ని స్వయంగా మహేష్ బాబు భరత్ అనే నేను సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.(Mahesh Babu)