Examining the TDP-Jana Sena-BJP Alliance AP Politics

AP Politics: రాష్ట్రంలో టీడీపీ సారధ్యంలో ఏర్పడిన కూటమి మనసులు కలవని బలవంతపు కాపురమే. తప్పనిసరి తంతు తప్ప అందులో తమకేం పెద్ద పాత్ర లేదని బీజేపీ తేల్చేసింది. కూటమి ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల చేసే సమయంలో ఢిల్లీ నుంచి బీజేపీ నేత సిద్దార్థ నాథ్ సింగ్ నుంచి వచ్చారు.

అంతేకాకుండా ఆ మ్యానిఫెస్టో కాపీలో ఎక్కడా మోడీ ఫోటో లేదు. కేవలం చంద్రబాబు, పవన్ ఫోటోలు మాత్రమే ఉన్నాయి. ముగ్గురు నాయకులు నిలబడి ఫోటోలకు…పత్రికలకు ఫోజులిచ్చే ముందు కాపీని చేత్తో పట్టుకోవడానికి కూడా బీజేపీ నేత సిద్దార్థ నాథ్ ఇష్టపడలేదు.

అనంతరం ఓ మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీకి జాతీయ స్థాయిలో ప్రత్యేక మేనిఫెస్టో ఉందని.. అదే రాష్ట్రంలోనూ ప్రచురించామన్నారు. ఇప్పుడు ఇచ్చింది టీడీపీ, జనసేన మేనిఫెస్టో అని.. దాంతో తమకు సంబంధం లేదని చెప్పారు.

Examining the TDP-Jana Sena-BJP Alliance AP Politics

అసలు రాష్ట్ర బీజేపీ నాయకులు కూడా మేనిఫెస్టో విడుదల కార్యక్రమానికి ఎవరూ రాలేదు.అధ్యక్షురాలు పురంధేశ్వరి సైతం హాజరు కాలేదు. దీంతో ఇది జస్ట్ పవన్… జనసేనల పొత్తు అని తేలిపోయింది..

అసలేం జరిగింది?

2014 లోనూ ఇదే మూడు పార్టీలు పొత్తులో ఎన్నికలకు వెళ్లాయి. అప్పుడు చంద్రబాబు దాదాపు ఆరువందల హామీలు ఇచ్చి… ఆ తరువాత మాటతప్పి.. మ్యానిఫెస్టోను పార్టీ వెబ్సైట్ నుంచి మాయం చేశారు.

ఇప్పుడు ఆ మ్యానిఫెస్టోను సీఎం వైయస్ జగన్ బయటకు తీసి.. ఒక్కో హామీని ప్రజలకు గుర్తు చేస్తున్నారు. రుణమాఫీ చేసారా అన్నా… పెన్షన్ ఇచ్చారా తాతా… డ్వాక్రా రుణాలు మాఫీ చేసారా చెల్లీ.. ఉద్యోగాలు ఇచ్చారా తమ్ముడూ.. అంటూ ప్రచారం చేస్తున్నారు.

ఈ హామీలకు అప్పట్లో మోడీ.. పవన్ సైతం గ్యారెంటీగా ఉన్నారు… వాళ్ళ ఫోటోలు సైతం ఉన్నాయ్… మళ్ళీ అలాంటి వాళ్లకు ఓట్లేస్తారా అంటూ ఊరూరా ప్రచారం చేయడంతో… చంద్రబాబు అమలుసాధ్యం కానీ హామీలవల్ల మేమెందుకు ప్రజలకు జవాబుదారీ కావాలి? మేమెందుకు పరువు పోగొట్టుకోవాలని భావించిన బీజేపీ ఈసారి ఆ హామీల విషయంలో మమ్మల్ని ఇన్వాల్వ్ చేయద్దని తేల్చి చెప్పింది.

అందుకే ఈసారి మ్యానిఫెస్టో మీద కేవలం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఫోటోలు మాత్రమే ఉన్నాయ్. మరోవైపు బాబు ఇస్తున్న హామీలకు బీజేపీకి ఎలాంటి బాధ్యత లేదని వాళ్ళు తేల్చేసారు.

ఇదిలా ఉండగా రాష్ట్రంలో ఎమ్మెల్యే, ఎంపీ టిక్కెట్ల విషయంలో కూడా చంద్రబాబు తమను మోసం చేసినట్లు కేంద్రం గుర్తించింది.. పీవీఎన్ మాధవ్, జివిఎల్ నరసింహారావు… సోము వీర్రాజు వంటివాళ్లకు టిక్కెట్లు ఇవ్వకుండా కేవలం టీడీపీ నాయకులనే బీజేపీ నేతలుగా చూపించి టిక్కెట్లు ఇచ్చుకుని అసలైన బీజేపీ నేతలను మోసం చేసారని అధిష్టానం గమనించింది…

అంటే ఎన్ని చేసినా….ఎంత చేసినా కుక్కతోక వంకరే అని …చంద్రబాబులోని మోసపూరిత గుణం మారదని స్పష్టతకు వచ్చిన ఢిల్లీ బీజేపీ నేతలు మీ మ్యానిఫెస్టోలో మాకు ఏం సంబంధం లేదని తేల్చేశారు.

Join WhatsApp