YS Sharmila Took Rs 82 Cr Loan From Jagan

Ys Sharmila: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల హడావిడి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎలక్షన్స్ జరిగితే ఏపీలో మాత్రం రెండు ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో ఏపీ రాజకీయాలు హిట్ ఎక్కాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఓడించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి ప్రతిపక్ష పార్టీలు. వైసీపీని ఓడించేందుకు జనసేన, తెలుగుదేశం పార్టీ మరియు బిజెపి పార్టీలు ఏకమయ్యాయి. Ys Sharmila

YS Sharmila Took Rs 82 Cr Loan From Jagan

ఈ మూడు పార్టీలతోపాటు కాంగ్రెస్ పార్టీ తరపున షర్మిల రంగంలోకి దిగారు. సీఎం జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఓట్లను చీల్చేందుకు ఆమె కంకణం కట్టుకున్నారు. కుటుంబంలో జరిగిన వివాదాల కారణంగా ఆమె రచ్చకెక్కారు. అయితే ఇందులో భాగంగానే కడప ఎంపీగా కాంగ్రెస్ పార్టీ తరఫున వైఎస్ షర్మిల పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే నిన్న కడప నియోజకవర్గంలో నామినేషన్ దాఖలు చేశారు షర్మిల. వైయస్ కుటుంబం నుంచి ఇద్దరు ఎంపీగా కడప నుంచి పోటీ చేయడం ఇదే మొదటిసారి. Ys Sharmila

Also Read: Nara Lokesh: మంగళగిరిలో ఈ సారి కూడా “నారా లోకేష్‌” గెలవడం కష్టమే..ఇదిగో లెక్కలు ?

అటు వైసిపి పార్టీ తరపున అవినాష్ రెడ్డి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే నామినేషన్ నేపథ్యంలో వైయస్ షర్మిల తన అప్పులు అలాగే ఆస్తుల వివరాలను పొందుపరిచారు. ఈ లెక్కల ప్రకారం ప్రస్తుతం వైయస్ షర్మిల కుటుంబ ఆస్తుల విలువ 182.82 కోట్లు. అంతేకాకుండా ఇందులో 9.29 కోట్ల రూపాయల స్థిరాస్తులు ఉన్నాయని షర్మిల స్పష్టం చేశారు. అంతేకాకుండా 123 కోట్ల చరాస్తులు ఉన్నాయని ఆమె వెల్లడించారు. Ys Sharmila

ఇక షర్మిల దగ్గర 3.69 కోట్ల బంగారం ఆభరణాలు ఉన్నాయి. వీటిలో 4.61 కోట్ల విలువైన వజ్రాలు ఉన్నాయి. ఇవన్నీ షర్మిలకు సంబంధించిన ఆస్తులు అయితే… ఆమెకు సంబంధించిన హక్కులు మాత్రం చాలా వింతగా ఉన్నాయి. షర్మిల పేరు మీద 82 కోట్ల 58 లక్షల రూపాయలు అప్పు ఉందని అఫీడవిట్ లో వెల్లడించారు షర్మిల. అంతేకాదు అప్పు మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నుంచి తీసుకున్నారట షర్మిల. ఇప్పుడు ఇదే విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.Ys Sharmila

Join WhatsApp