Pooja Hegde: సినిమా పరిశ్రమలో ఫెడౌట్ అయిపోయిన తర్వాత తిరిగి అవకాశాలను అందుకోవడం చాలా కష్టమని చెప్పాలి. ముఖ్యంగా హీరోయిన్ లు కం బ్యాక్ చేయడం కత్తి మీద సామలాంటిదే. అలాంటిది పూజ హెగ్డే మొదట్లో సినిమాలను తెలుగులో చేసి ఇక్కడ అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అక్కడ పలు సినిమాలను కూడా చేసింది. అయితే అక్కడ వచ్చిన క్రేజ్ తో మళ్ళీ తెలుగు సినిమాలలో నటించడం ఆమె మొదలుపెట్టింది. ఇక్కడ వరుస పెద్ద సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.

Pooja Hegde: Will Lady-Oriented Films Revive Her Career?

అలా పెద్ద పెద్ద హీరోలు అందరితో కలిసి నటించిన పూజా హెగ్డే చేతిలో సినిమాలు లేవనే చెప్పాలి. కారణమేదైనా కూడా ఇప్పుడు వచ్చిన కొత్త హీరోయిన్లు ఆమె అవకాశాలను తన్నుకు పోతున్నారు. పూజా హెగ్డే మాత్రం ఖాళీగా ఉండిపోతుంది. ఇటు బాలీవుడ్ కూడా ఆమెకు పెద్దగా అవకాశాలు ఇవ్వడం లేదు. దాంతో పూజా హెగ్డే పని దాదాపు అయిపోయిందని కొంతమంది భావిస్తున్నారు. అయితే ఆమె అభిమానులు మాత్రం పూజా హెగ్డే మరికొన్ని రోజులు సినిమాలలో చేస్తే బాగుంటుంది అని చెబుతున్నారు.

Also Read: Naga Chaitanya: ఘనంగా నాగచైతన్య,శోభిత ఎంగేజ్మెంట్.. వైరల్ అవుతున్న ఫోటోలు!!

అందుకు ఆమె లేడీ ఓరియంటెడ్ సినిమాలను చేస్తే ఇంకా బాగుంటుంది అని అంటున్నారు. పెద్ద హీరోయిన్లందరూ కూడా సినిమా అవకాశాలు రానప్పుడు చేసే పని ఇదే. ఓ మంచి కథతో లేడీ ఓరియంటెడ్ సినిమాలను చేసి మళ్లీ వాళ్ళు కం బ్యాక్ చేయాలని భావిస్తుంటారు. ఇప్పటికే త్రిష, నయనతార, అనుష్క, సమంత, తమన్నా వంటి హీరోయిన్లు హీరోల సరసన సినిమాలు చేయనప్పటికీ కూడా లేడీ ఓరియంటెడ్ సినిమాలతో తమ సత్తా చాటుతూ తమ క్రేజ్ ని ఏమాత్రం తగ్గించుకోకుండా ముందుకు వెళుతున్నారు. మరి పూజ హెగ్డే కూడా అలాంటి సినిమాలను చేసి తిరిగి తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటుందా అనేది చూడాలి.