Poonam Kaur: సినీ నటి పూనమ్ కౌర్ ఎప్పుడు ఏం మాట్లాడుతుందో అర్థం కాదు.ఎందుకంటే ఆమె కొంతమంది పై చేసే పరోక్ష కామెంట్లు సోషల్ మీడియా వేదికగా ఎప్పుడు హాట్ టాపిక్ గానే ఉంటాయి. అయితే ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ రాజకీయంగా బలపడ్డాక డిప్యూటీ సీఎం అయిన తర్వాత మరిన్ని సెన్సేషనల్ పోస్టులు చేస్తూ పవన్ అభిమానుల సహనాన్ని పరీక్షిస్తుంది. అయితే ఇక్కడ పూనమ్ కౌర్ కి జరిగిన అన్యాయం గురించి కూడా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఆమెకు ఏం అన్యాయం జరిగిందో ఏమో కానీ ప్రతిసారి త్రివిక్రమ్ ని, పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ మాట్లాడుతుంది.
Poonam Kaur sensational post on Pawan
అయితే కొంతమంది సినీ ఇండస్ట్రీ వాళ్ళు మాత్రం త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ సినిమాలో హీరోయిన్ అవకాశం ఇస్తానని ఆమెను వాడుకొని తీరా ఆ సినిమాలో వేరే హీరోయిన్ ని తీసుకున్నారని, దాంతో తనని వాడుకొని వదిలేసాడు అనే కోపంతో పూనమ్ కౌర్ అలా ప్రతిసారి త్రివిక్రమ్ పై,పవన్ కళ్యాణ్ పై తన పగ తీర్చుకుంటుంది అని అంటున్నారు. అయితే ఇందులో ఉన్నది ఎంత నిజమో మాత్రం తెలియదు.కానీ తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో పూనమ్ కౌర్ పెట్టిన పోస్ట్ నెట్టింట సంచలనం సృష్టిస్తుంది. అయితే ఆ పోస్టులో ఎవరి గురించి చెప్పిందో పేరు బయట పెట్టలేదు.(Poonam Kaur)
Also Read: Boney Kapoor-Sridevi: పాపం.. ఆ సినిమా బోనీ కపూర్-శ్రీదేవి లను విడదీసిందని మీకు తెలుసా..?
కానీ ఇది విన్న వారందరూ మాత్రం పవన్ కళ్యాణ్ గురించే పెట్టిందని మాట్లాడుకుంటున్నారు. మరి ఇంతకీ పూనమ్ కౌర్ పెట్టిన పోస్టులో ఏముందంటే.. ఎవరెవరినో తీసుకువస్తూ కట్టుకున్న భార్యలను మోసం చేస్తున్నారు. కట్టుకున్న దాన్ని పిల్లలతో సహా రోడ్డు మీద వదిలేస్తారు.ఇదంతా గురూజీ దయనే.. ఆయన దయతో వచ్చిన ఇల్లాలు మాత్రం హాయిగా ఉంటుంది.అయితే ఇండియన్ మహిళలని చిన్నప్పటినుండే వారి ఫ్యామిలీ వాళ్లు ట్రైన్ చేస్తూ ఉంటారు. కట్టుకున్న భర్త కోసం అన్ని త్యాగాలు చేయాలి.. వారి సుఖమే నీ సుఖం అనేలా ముందుగానే ప్రిపేర్ చేస్తారు.ఆమె ఎంతో మంచి మనస్తత్వం కలది.నిజాయితీపరురాలు..
తన దగ్గర ఏదైనా సరే ఇతరులకు ఇచ్చే గుణం ఉండేలా ముందుగానే ప్రిపేర్ చేసి పెడతారు. కుటుంబం కోసం ఇలా ఏం చేసినా అణిగిమణిగి ఉంటారు. కానీ దయచేసి అలా ఎప్పుడూ చేయకండి దండం పెడతా ప్లీజ్..అంటూ పూనమ్ కౌర్ తన సోషల్ మీడియా వేదికగా పెట్టిన పోస్ట్ సంచలనం సృష్టిస్తోంది. అయితే ఇది పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించే చేసిందని,పవన్ కళ్యాణ్ భార్యని మార్చడంలో గురూజీ పాత్ర ఉంది అన్నట్లుగా పోస్ట్ చేసింది అంటూ నెటిజన్స్ భావిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ పూనం కౌర్ రోజుకొక పోస్ట్ పెడుతూ అటు గురూజీకి ఇటు పవన్ కళ్యాణ్ కి నిద్ర లేకుండా చేస్తుందని నెటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు.(Poonam Kaur)