Tollywood Stars: టాలీవుడ్లో హీరోయిన్స్‌తో వివాహం చేసుకున్న హీరోలు అనేక మంది ఉన్నారు. అయితే, నాగార్జున, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోలు నార్త్ ఇండియా కి చెందిన అమ్మాయిలను పెళ్లి చేసుకోవడం ప్రత్యేకమైన విషయం. మన సంస్కృతి, జీవనశైలి, సంప్రదాయాలకు భిన్నంగా ఉండే ఉత్తర భారతీయులైన అమ్మాయిలను వారు ఎంపిక చేసుకోవడం ఒక రీతిలో సాహసమే అయినా ఈ హీరోలు హిందీ, బెంగాలీ, గుజరాతీ, రష్యన్ హీరోయిన్ లను వివాహం చేసుకున్నారు.
Popular Tollywood Stars Who Married Outside Their Culture
టాలీవుడ్లో ప్రముఖ తారలలో ఒకరైన నాగార్జున మూడు దశాబ్దాల పాటు స్టార్ హీరోగా ఉన్నారు. ఆయన మొదటి వివాహం దగ్గుబాటి రామానాయుడు కుమార్తె లక్ష్మితో జరిగింది, కానీ నాలుగేళ్ల తర్వాత వీరు విడిపోయారు. 1992లో నాగార్జున హీరోయిన్ అయిన అమలను రెండోసారి వివాహం చేసుకున్నారు. అమల తండ్రి బెంగాలీ, తల్లి ఐర్లాండ్ కు చెందినవారు. వీరి కుమారుడు అఖిల్, ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు.
Also Read: Prashanth Neel: ప్రశాంత్ నీల్ కు ఫస్ట్ ఫ్లాప్.. భయపడుతున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్!!
సూపర్ స్టార్ మహేష్ బాబు ముంబైకు చెందిన నమ్రత శిరోద్కర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వంశీ చిత్రంలో కలిసి నటించినప్పుడు వీరి మధ్య ప్రేమ పుట్టింది. ఐదేళ్ల పాటు రహస్యంగా ప్రేమించి 2005లో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు – గౌతమ్ మరియు సితార. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. ఆయన మొదటి భార్య వైజాగ్‌కు చెందినవారు.
ఆ తరువాత, ఆయన రేణు దేశాయ్‌ను ప్రేమించి వివాహం చేసుకున్నారు, వీరికి ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఉన్నారు, అయితే 2012లో వారు విడిపోయారు. రేణు దేశాయ్ గుజరాత్‌కు చెందినవారు. తర్వాత, పవన్ కళ్యాణ్ రష్యన్ యువతి అన్నా లెజినోవాను వివాహం చేసుకున్నారు, వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.మహేష్ బాబు, నాగార్జున, పవన్ కళ్యాణ్ ఉత్తర భారత అమ్మాయిలతో పెళ్లి చేసుకోవడానికి ప్రేమే ప్రధాన కారణం. ప్రేమికులకు కులం, మతం, ప్రాంతం, లేదా భాష బేధాలు ఉండవు. సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ, వారు తమకు ఇష్టమైన వారిని వివాహం చేసుకున్నారు.