Pawan Kalyan: ప్రస్తుతం ఇండస్ట్రీలో కొండా సురేఖ మాట్లాడిన మాటలకి ఇండస్ట్రీ జనాలు స్పందించిన తీరుకి సంబంధించిన ట్విట్లు వైరల్ అవుతున్నాయి.ఈ నేపథ్యంలోనే చాలామంది కొండా సురేఖ నాగార్జున ఫ్యామిలీని అంటే అంతలా మిడిసిపడే మీరు చంద్రబాబు భార్యని,చంద్రబాబుని అన్నప్పుడు ఎందుకు సైలెంట్ గా ఉన్నారు. చిరంజీవి తల్లిని, భార్యని అన్నప్పుడు ఎందుకు మౌనం వహించారు అంటూ టార్గెట్ గా మాట్లాడుతున్నారు.
Posani krishna murali sensational comments on Pawan Kalyan
అయితే ఈ మాటలపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో పోసాని కృష్ణ మురళి పవన్ కళ్యాణ్ పై షాకింగ్ కామెంట్లు చేశారు. ఏం పీకాడు అంటూ ఆయన మాట్లాడిన మాటలు పవన్ అభిమానులను ఆగ్రహానికి గురిచేస్తున్నాయి. ఇక ఇంతకీ ఆయన ఏం మాట్లాడారంటే.. గతంలో చిరంజీవి భార్యని తల్లిని కొంతమంది రాజకీయ నాయకులు విమర్శించారు. కానీ ఆ సమయంలో అండగా ఉండాల్సిన సొంత తమ్ముడు పవన్ కళ్యాణ్ బయటకు వచ్చి నోరు విప్పలేదు. (Pawan Kalyan)
ఆ టైంలో పవన్ కళ్యాణ్ ఏం పీకాడు..నాకు చిరంజీవి ఏమైనా తోడబుట్టినవాడా.. నేనెందుకు ఆయనకు సపోర్ట్ చేసి బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టాను.కొంచమైనా పవన్ కి తెలియదా..నా అన్నని,వదినని,తల్లిని అలా అంటే వారిని ఎలా వదిలేయాలి. ప్రెస్ మీట్ పెట్టి వారితో క్షమాపణలు చెప్పించాలి అని అనిపించలేదా.. ఇప్పుడు నాగార్జునకి సినీ ఇండస్ట్రీ సపోర్ట్ చేస్తే బాగా మాట్లాడుతున్నారు.సినిమా వాళ్ళ సంగతి పక్కన పెడితే.. పవన్ కళ్యాణ్ నాగబాబు సొంత తమ్ముళ్లే కదా..మరి వాళ్ళు ఎందుకు నోరు విప్పలేదు.
నాకు చిరంజీవి ఫోన్ చేసి నా భార్య పిల్లలు ఏమన్నారు మురళి అని బోరున ఏడ్చారు. దాంతో అంత పెద్ద హీరో లెజెండ్రీ నటుడు ఏడవడంతో నాకు కూడా కన్నీళ్లు వచ్చేసాయి.ఆయన్ని ఫోన్ కట్ చేయమని చెప్పి వెంటనే ఒక ప్రెస్ మీట్ పెట్టి ఎవరైతే అంజనాదేవిని,సురేఖ గారిని అవమానించారో వారితో ఆ ఇద్దరికీ క్షమాపణలు చెప్పించాను. నేను చేసిన పని పవన్ కళ్యాణ్ ఎందుకు చేయలేకపోయారు. ఏం పీకారు అని మాట్లాడుతున్నారు అంటూ పోసాని కృష్ణ మురళి ఘాటు వ్యాఖ్యలు చేశారు.(Pawan Kalyan)