Prabhas: ప్రభాస్ సినిమా షూటింగ్ సమయంలో ఏమాత్రం గ్యాప్ దొరికినా విదేశాలకు చెక్కేస్తూ ఉంటారు.ఇప్పటికే ఆయన లండన్, అమెరికా వంటి ఎన్నో ప్రదేశాలకు వెళ్లి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అయితే తాజాగా ఈయన యూరప్ వెళ్ళిపోబోతున్నట్టు తెలుస్తోంది మరీ ముఖ్యంగా ఈయన నటించినా భారీ బడ్జెట్ మూవీ కల్కి 2898 ADసినిమా జూన్ 27న విడుదలవబోతుంది.
Prabhas is leaving for Europe without the release of Kalki.. Is that the reason
అయితే ఈ సినిమా విడుదలయ్యాక పోతే సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నాడు కావచ్చు అనుకుంటారు. కానీ ఈ సినిమా విడుదలవకముందే ప్రభాస్ యూరప్ చెక్కేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే యూరప్ కి ప్రభాస్ వెళ్లడానికి కారణం ఏంటి అని ప్రతి ఒక్క అభిమాని సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ పెడుతున్నారు. అయితే గత కొద్ది రోజులుగా ప్రభాస్ తన మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకుంటున్న సంగతి మనకు తెలిసిందే.(Prabhas)
Also Read: Allu Arjun: బన్నీ ఇంట్లో వరలక్ష్మి శరత్ కుమార్.. హల్చల్ చేస్తున్న ఫొటోస్..!
అయితే బాహుబలి సినిమా షూటింగ్ సమయంలో ఏర్పడిన గాయం ఇప్పటికి కూడా తగ్గడం లేదు. ఇక ఆ మధ్యకాలంలో ఆదిపురుష్ సినిమా సమయంలో ప్రభాస్ కుంటుకుంటూ నడవడం, అలాగే సినిమా విడుదలయ్యాక లండన్ వెళ్లి మోకాలికి చికిత్స చేసుకోవడం వంటి వార్తలు మీరు వినే ఉంటారు.
అయితే తాజాగా ప్రభాస్ కల్కి మూవీ విడుదలవ్వక ముందే యూరప్ వెళ్తున్నారనే ఊహగానాలు టాలీవుడ్ మీడియాలో వినిపించడంతో ఈయన తన ఆరోగ్య సమస్యల గురించి వెళ్తున్నారా లేక మరేదైనా కారణం ఉందా అని ఫ్యాన్స్ లో ఓ రకమైన ఆసక్తి నెలకొంది. మరి నిజంగానే ప్రభాస్ యూరప్ కి చెక్కేస్తున్నారా లేక అది రూమరా అనేది తెలియాల్సి ఉంది.(Prabhas)