Prabhas: కల్కి సినిమాతో 1000 కోట్లకు పైగా కలెక్షన్లను అందుకుని తనకు తిరుగులేదు అనిపించుకున్నాడు ప్రభాస్. రెండవసారి 1000 కోట్లు అందుకున్న హీరోగా రికార్డుల కెక్కిన ప్రభాస్ కల్కి సినిమా విడుదలయ్యి చాలా రోజులు అయినా కూడా డీసెంట్ కలెక్షన్లతో ముందుకు వెళుతూ ఈ సినిమాను సక్సెస్ ఫుల్ గా థియేటర్లలో కొనసాగుతుంది. ప్రస్తుతం ప్రభాస్ ఫోకస్ తన తదుపరి సినిమా పైనే ఉంది. ఆయన నుంచి తదుపరి రాబోయే సినిమా ‘రాజాసాబ్’. మారుతి దర్శకత్వంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా యొక్క షూటింగ్ 50% పూర్తికాగా ప్రభాస్ ఇప్పటిదాకా నటించని జోనర్ లో నటిస్తున్నాడు.
Prabhas reduced his remuneration
హారర్ కామెడీ నేపథ్యంలో మారుతి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుండగా ఇది ఏ స్థాయిలో ఉంటుందో అని ప్రభాస్ అభిమానులు ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మారుతికి ఈ తరహా సినిమాలు చేయడం కొట్టిన పిండి. అతని కామెడీ స్టైల్ కూడా ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. అలాంటి సినిమాల ద్వారానే ప్రేక్షకులకు దగ్గరయ్యాడు మారుతీ. అలాంటిది ఇప్పుడు ఇంత పెద్ద సినిమా చేస్తున్నాడు అంటే విశేషమని చెప్పాలి. ఇప్పటిదాకా ఇంత పెద్ద హీరోని డైరెక్ట్ చేయని మారుతి ప్రభాస్ ను ఏ విధంగా చూపిస్తాడు అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Also Read: Nayantara: ఇంత జరిగినా ఆ విషయంలో నయన్ తగ్గేదేలే!!
ఇటు పీపుల్స్ మీడియా కూడా దాదాపు 250 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తుంది. ఇందులో ప్రభాస్ రెమ్యునరేషన్ గా 125 కోట్ల రూపాయలు తీసుకున్నాడని చెబుతున్నారు. ఈ సినిమాలో సగం బడ్జెట్ ఆయన కోసమే కేటాయించారు. ఇంకా విజువల్ ఎఫెక్ట్స్ కి కూడా ఈ సినిమాలో ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. దానికోసం ఎక్కువ మొత్తం లో వినియోగిస్తున్నారు. అయితే ఈ సినిమా కోసం ప్రభాస్ రెమ్యునరేషన్ తగ్గించుకున్నారని వార్తలు వస్తున్నాయి. మొదట్లో 125 కోట్లు అనుకున్న పారితోషకం కాస్త ఇప్పుడు 85 కోట్లు మాత్రమే ఆయన తీసుకోబోతున్నారని అంటున్నారు.
ఎందుకంటే ఆదిపురుష్ సినిమా యొక్క తెలుగు రిలీజ్ రైట్స్ ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారు తీసుకోగా ఆ సినిమా వారికి 35 కోట్ల మేరకు నష్టాన్ని మిగిల్చింది. ఈ నేపథ్యంలో వారి నష్టాన్ని పూడ్చడానికి ప్రభాస్ తన రెమ్యూనికేషన్ తగ్గించుకుని మరి ఈ రాజా సాబ్ సినిమా చేస్తున్నారట. మరి ఈ సినిమా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారికి ఈ సినిమా విజయాన్ని తీసుకు వస్తుందా అనేది చూడాలి.