Prabhas: ప్రభాస్ దర్శక ధీరుడు రాజమౌళి మధ్య అనుబంధం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే వీరిరువురి కాంబినేషన్లో బాహుబలి 1,బాహుబలి 2 తో పాటు ఛత్రపతి వంటి సినిమాలు వచ్చాయి. మరి ముఖ్యంగా రాజమౌళి పాన్ ఇండియా సినిమాలైనా బాహుబలి 1, బాహుబలి 2 సినిమాలతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా మారారు.అయితే అలాంటి ప్రభాస్ తో రాజమౌళి చేయవలసిన పాత్రని జక్కన్న కంటే ముందే నాగ్ అశ్విన్ చేయించారట.
Prabhas role with Rajamouli.. but with Nag Ashwin
మరి ఇంతకీ రాజమౌళి ప్రభాస్ తో చేయించాలి అనుకున్న ఆ పాత్ర ఏంటి.. నాగ్ అశ్విన్ చేయించింది ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. దేశవ్యాప్తంగా ప్రస్తుతం కల్కి మానియా కొనసాగుతోంది అయితే ఈ సినిమా చివర్లో క్లైమాక్స్ సీన్ చూసేవాళ్లకు గూస్ బంప్స్ తెప్పిస్తుంది. అయితే ఈ సినిమా చివర్లో ప్రభాస్ ని నాగ్ అశ్విన్ మహాభారతంలోని కర్ణుడి పాత్రలో చూపిస్తారు.అయితే ఈ కర్ణుడి పాత్రని ప్రభాస్ కి నాగ్ అశ్విన్ కంటే ముందే రాజమౌళి చేయించాలి అనుకున్నారట.(Prabhas)
Also Read: Prabhas: ‘కల్కి 2898 AD’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్!!
అయితే ఇదే విషయాన్ని రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో కూడా చెప్పారు.అదేంటంటే రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ అనగానే అందరికీ మహాభారతం గుర్తుకొస్తుంది.అయితే ఈ మహాభారతం సినిమాలో ఎంతోమంది స్టార్లను తీసుకొని సినిమా తెరకెక్కిస్తాను అని ఇప్పటికే చాలా ఇంటర్వ్యూలో రాజమౌళి చెప్పుకొచ్చారు. ఇక అందులో భాగంగా ఓసారి ప్రభాస్ కి ఏ క్యారెక్టర్ ఇస్తారు అని కొంతమంది రాజమౌళిని అడగగా..
ప్రభాస్ కి అయితే కర్ణుడి క్యారెక్టర్ ఇచ్చేస్తాను అని చెప్పారు. అలా తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన మహాభారతం మూవీ లో ప్రభాస్తో కర్ణుడి పాత్ర వేయించాలి అనుకున్న రాజమౌళికి షాక్ తగిలింది.ఎందుకంటే నాగ్ అశ్విన్ రాజమౌళి కంటే ముందే కల్కి క్లైమాక్స్ సన్నివేశంలో కర్ణుడు పాత్రలో ప్రభాస్ ని చూపించారు.అలా రాజమౌళి ప్రభాస్ తో చేయించాలి అనుకున్న పాత్ర ని నాగ్ అశ్విన్ ముందుగానే చేయించారు.(Prabhas)