Prabhas: Why Is He So Interested in Smaller Films?

Prabhas: ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న పలు చిత్రాలు సెట్స్ మీద ఉన్నాయి. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో చేస్తున్న ‘రాజా సాబ్’ చిత్రాన్ని పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ లో ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. ఇంకా 50 రోజుల షూటింగ్ మిగిలి ఉందని చెబుతున్న నేపథ్యంలో ప్రభాస్ ఈ చిత్రం సెట్స్ మీద ఉండగానే మరొక సినిమాని కూడా మొదలుపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. గత కొన్ని రోజులుగా ప్రభాస్ హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు అన్న వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

Prabhas: Why Is He So Interested in Smaller Films?

పిరియాడిక్ వార్ డ్రామా బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా ఉండబోతుందట. సీతారామం సినిమాతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న దర్శకుడు హను రాఘవపూడి చాలా రోజులుగా ఈ కథపై వర్క్ చేస్తుండగా ప్రభాస్ దీనిని ఒప్పుకోవడం మరింత విశేషం. వరస భారీ చిత్రాలు చేస్తూ దేశవ్యాప్తంగా ప్రేక్షకులను అలరిస్తున్న ప్రభాస్ ఇప్పుడు ఈ మీడియం బడ్జెట్ సినిమాను చేయడానికి ఒప్పుకోవడం విశేషం అనే చెప్పాలి. అలా బ్యాక్ టు బ్యాక్ చిన్న బడ్జెట్ సినిమాలను చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకోవాలని ప్రభాస్ చూస్తున్నట్లు తెలుస్తుంది.

Also Read: Naga Chaitanya: ఘనంగా నాగచైతన్య,శోభిత ఎంగేజ్మెంట్.. వైరల్ అవుతున్న ఫోటోలు!!

ఇటీవల ఆయన హీరోగా నటించిన ‘కల్కి’ సినిమా భారీ విజయాన్ని సాధించింది. రెండు సార్లు 1000 కోట్ల వసూళ్లను సాధించిన హీరోగా రికార్డులకెక్కాడు ఈ నేపథ్యంలో ఇప్పుడు చేస్తున్న ఈ చిత్రాలు ఏ విధమైన విజయాలను అందుకుంటాయో చూడాలి. ప్రస్తుతం ప్రభాస్ ఆలోచన కూడా చిన్న సినిమాలు చేయడం పైనే ఉంది. ఈ సినిమా తర్వాత కూడా మరొక చిన్న సినిమా చేయాలని ప్రభాస్ భావిస్తున్నాడట. ఆ విధంగా మారుతి, హను రాఘవపూడి లాగా ఏ దర్శకుడికి ప్రభాస్తో సినిమా చేసే అవకాశం కలుగుతుందో చూడాలి.