Producer Dil Raju Shares Thoughts on Munna and Its Reception

Producer Dil Raju: ప్రభాస్ కొన్ని సంవత్సరాల క్రితం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ‘మున్నా’ అనే స్టైలిష్ యాక్షన్ సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. ఈ సినిమాలో ఇలియానా హీరోయిన్‌గా, ప్రకాష్ రాజ్ విలన్‌గా, వేణు, బ్రహ్మానందం వంటి నటులు ముఖ్య పాత్రల్లో నటించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఈ సినిమాను నిర్మించారు, అలాగే హరిజ్ జయరాజ్ సంగీతాన్ని అందించారు.

Producer Dil Raju Shares Thoughts on Munna and Its Reception

సినిమా మంచి అంచనాల నడుమ విడుదలైనప్పటికీ, బాక్సాఫీస్ వద్ద పెద్దగా విజయం సాధించలేదు. ఇటీవల దిల్ రాజు ఒక ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. సినిమా విడుదలైన రోజునే థియేటర్లో ప్రేక్షకులతో కలిసి సినిమా చూసానని, అయితే ప్రేక్షకులకు సినిమా కనెక్ట్ కావడం లేదని అర్థమైందని ఆయన చెప్పారు. ఈ సమయంలోనే సినిమాకు సంబంధించి ఫలితాలు స్పష్టమయ్యాయని ఆయన అభిప్రాయపడ్డారు.

Also Read: Jagan Mohan Reddy: జగన్ కు ఆ విషయం అర్థమయితేనే ఎన్నికల్లో గెలుస్తాడు.. లేదంటే అంతే!!

ఈ విషయం ప్రభాస్‌కు తెలియజేయాలని ఆయన అతని ఇంటికి వెళ్లారని, అయితే అప్పటికే ప్రభాస్ తన స్నేహితులతో కలిసి సినిమాని సక్సెస్‌గా సెలబ్రేట్ చేస్తూ ఉన్నాడని దిల్ రాజు వివరించారు. ఆయన వెళ్ళి సినిమా పెద్ద సక్సెస్ కాదని చెప్పగానే, ప్రభాస్ “అందరూ హిట్ అంటున్నారు కదా” అని స్పందించాడని దిల్ రాజు గుర్తు చేసుకున్నారు.

దిల్ రాజు మాట్లాడుతూ, “ఆది రాంగ్ రిపోర్ట్” అని, సినిమా యావరేజ్‌ అవుతుందని చెప్పారు. ఆయన అంచనా చేసినట్లుగానే సినిమా ఆ స్థాయిలోనే ముగిసింది. ఈ రీతిలో, ప్రస్తుత యదార్థాన్ని ప్రభాస్ అర్థం చేసుకోవడానికి కొంత సమయం పట్టిందని తెలిపారు.